ప్రమాదాలతో హోరెక్కిస్తున్న మధురవాడ జాతీయ రహదారి!
నిత్యం ప్రమాదాలకు గురవుతున్న పట్టించుకోని ప్రజాప్రతినిధులు!
పరామర్శించటం తప్ప పాదచారుల వంతెన ఏర్పాటుకు ప్రయత్నించని స్థానిక నేతలు!
మధురవాడ: వి న్యూస్: జులై 22:
ప్రతి దినం రద్దీగా ఉండే ప్రాంతం మధురవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రోడ్డు ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసు వారు ప్రత్యేక గస్తీ నిర్వహిస్తూ ఆంక్షలు పెడుతున్న సరే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జీవీఎంసీ జోన్ టు పరిధిలోని మధురవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతి దినం పాఠశాలకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే సామాన్య ప్రజలు కూడా రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాలు అరికట్టడానికి ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దీన్ని అరికట్టలేకపోతున్నారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా సరే ప్రభుత్వం అక్కడ ఒక పాదచారుల వంతెన నిర్మించాలని అనేకసార్లు ప్రజాప్రతినిధులకి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు చెప్పిన సరే ఇప్పటికి ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. రోజుకో ప్రమాదంతో ఆ రోడ్డు రక్తంతో తడుస్తున్న సరే అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారు తప్ప దానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అక్కడ ప్రమాదం జరుగుతుంది. రెండు వారాల క్రితం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ముగ్గురికి ప్రమాదం జరిగింది. అది మరువక ముందే శనివారం తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా ఒక మహిళను లారీ ఢీకొంది. ఈ ఘటనలో యువతికి కాళ్ళు పోయే పరిస్థితి ఏర్పడింది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా సరే స్థానిక శాసనసభ్యులు కనీసం స్పందించడం లేదని ఇక్కడొక పాదచారుల వంతేన ఏర్పాటు చేయాలని ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రమాదాలు అరికట్టాలి అంటే మధురవాడ జంక్షన్ లో రోడ్డు దాటేటప్పుడు విద్యార్థులకు ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు ఒక పాదచారుల వంతెన ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజా సంఘాలు ఎమ్మెల్యేని అధికారులను కోరుకుంటున్నారు.