సాయిరాం కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డా బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్నిధ్వంసం.

సాయిరాం కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డా బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్నిధ్వంసం.

మధురవాడ : వి న్యూస్ :జూలై 10:

విశాఖ  జిల్లా జీవీఎంసి జోన్ 2 వార్డు 5 , సాయిరాం కోలని ఫేస్ 2లో భారత రాజ్యాంగ నిర్మాత డా బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... సాయిరాం కోలని ఫేస్ 2 రోడ్ లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం తలను అదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తల భాగం పగలే  విధంగా దాడి చేశారు. విగ్రహం తల భాగాన్ని రాళ్లతో  దాడి చేసి ఆ రాళ్లను రోడ్ పై పడేశారు.

ఉదయం స్థానికులు గుర్తించి అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం గురించి తెలియడంతో గ్రామస్తులు, దళిత సంఘాల నాయకులు విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత నాయుకులు కొరారు .