విశాఖ జిల్లా కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో గృహ సంపర్క్ అభియాన్ బిజేపి సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ:-

విశాఖ జిల్లా కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో గృహ సంపర్క్ అభియాన్ బిజేపి సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ:- 

భీమిలి :వి న్యూస్ జులై 9: 

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గO లో ఆనందపురం మండలంలో 8జూలై మరియు,9జూలై,ఈ రెండు రోజులు ముకుందపురం,రేగాని గూడెం, గ్రామంలో బిజేపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 సంవత్సరముల సంక్షేమం సుపరిపాలనలో ప్రజలకు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కరపత్ర లా ద్వారా ప్రతి ఒక్కరికి  ప్రతి ఇంటికి గృహ సంపర్క్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఆనందపురం మండలం లో గత నెల రోజులుగా, మండలంలో 10 పంచాయతీలు పర్యటించడం జరిగిందని,గ్రామీణ ప్రాంత ప్రజల్లో బిజెపి పార్టీ కి మంచి ఆదరణ ఉందని,దానికి కారణం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయినా కరోనా వ్యాక్సిన్.వ్యక్తిగత మరుగుదొడ్లు.ఉచిత బియ్యం.జల జీవన్ మిషన్,ద్వారా ప్రతి ఇంటికి వాటర్ కొళాయిలు.ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు,ముద్ర రుణాలు,ప్రధానమంత్రి ఆవాస్ యోజన,ఈ-శ్రమ్ కార్డులు ద్వారా, అసంఘిక కార్మికుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ ద్వారా రక్షణ కల్పించడం.కేంద్ర ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలు అమలు జరిపి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను ఆదుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వoమే మరల 2024 లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మన అందరి పైన ఉందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 సంవత్సరాల పరిపాలన  9090902024 నెంబర్ కి మిస్డ్ కాల్స్  ద్వారా మద్దతు తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆనందపురం   మండల ఉపాధ్యక్షులు కర్రోతు సత్యనారయణ కిసాన్ మోర్చా నాయకులు బంక సీతం నాయుడు, చిన్నారి,తదితరులు పాల్గొనడం జరిగింది.