కమనీయం అప్పన్న కల్యాణం సింహాచలం,

కమనీయం అప్పన్న కల్యాణం సింహాచలం,  

శ్రీ శ్రీ  వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారి దేవస్థానం,

సింహాచలం(విశాఖపట్నం)* తేదీ:22-07-2023

శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా  ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో  మండ పంలో అధిష్టింపజేశారు.  పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.