అరుదైన రక్తదానం చేసిన అప్పారావు కీ అభినందనలు.

అరుదైన రక్తదానం చేసిన అప్పారావు కీ అభినందనలు

విజయనగరం జిల్లా వి న్యూస్ జూలై 22 :-

భారతదేశం లోనే అరుదైన బొంబాయి బ్లడ్ గ్రూప్ ను

మాతృభూమి సేవా సంఘ ద్వారా విశాఖపట్నం అపోలో హాస్పిటల్ లో ఉన్న పెషేంట్ కీ రక్తదాత అప్పారావు మానవత్వం తో అలోచించి రక్తదానం చేయడం తో బొంబాయి గ్రూపు రక్తం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మాతృభూమి సేవా సంఘం రక్తదానం - ప్రాణదానం టీం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటు,

రక్తదానం అంటే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతాము చెప్పనక్కర్లేదు.

మీరు రక్తదానం చేసే ప్రతిసారి ఒక మనిషి ప్రాణాలు కాపాడి ఒక్క కుటుంబానికి అండగా నిలిచి సహాయం చేసిన వాళ్ళు అవుతారు అని మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు  అన్నారు.

ఈ సందర్భంలో పెషేంట్ తాలూకా బంధువులు మాట్లాడుతూ......

గత మూడు రోజులుగా అనేక ప్రయత్నాలు చేసిన తరువాత

ఎస్ హెచ్ జె ఫౌండేషన్ స్థాపకుడైన హర్ష జనపరెడ్డి సహాయం తో మాతృభూమి సేవా సంఘం ద్వారా రక్తదాత అప్పారావు రక్తదానం చేయడం తో మాకు ప్రాణాపాయం నుండి బయట పడ్డం అన్నారు.మనిషిగా పుట్టినందుకు మానవత్వం చాటుకోని రక్తదానం చేయండి అని న్. వి. న్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ నాగేశ్వరరావు అన్నారు.సహాయం చేయాలంటే ధనమే అవసరం లేదు సాయం చేసే గుణం ఉంటే చాలు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని మాతృభూమి సేవా సంఘం చీపురుపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బూర్లె.పైడినాయుడు అన్నారు.