స్కూల్ రోడ్డు అవస్థలు వర్ణనాతీతం
నూజివీడు: వి న్యూస్ జులై 21:
నూజివీడు పట్టణంలోని గాంధీనగర్ అప్పారావుపేట స్కూలు రోడ్డు పూర్తిగా మురుగు, బురదతో నిండి ఉండడం, డ్రైనేజీలలో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ రోడ్డు లో వాహనాలే కాదు కనీసం పాదచారులు వెళ్లేందుకు కూడా సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోంచి బయటకు రావాలన్నా, బయట నుండి ఇళ్లకు వెళ్లాలన్న నిత్యం నరకమే కనిపిస్తోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై పేరుకుపోయిన మురుగు, బురద, డ్రైనేజీలలోని చెత్తాచెదారం తొలగించాలని కోరుతున్నారు.