*హైవే పనులు...! మా ప్రాణాలకు వచ్చాయి..!*
అల్లూరి జిల్లా,రాజవోమ్మంగి వి న్యూస్ జులై 9 :-
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవోమ్మంగి మండలం, జడ్డంగి పంచాయితీ లో
హైవే పనుల నిమిత్తం రోడ్ కి ఇరువైపులా డ్రైనేజీ తీసి ఉన్నారు.అయితే ఎక్కడైతే వీధి రోడ్లు ఉన్నాయో అక్కడ వీధుల్లోకి వెళ్ళటానికి ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు లను పూర్తిగా బ్లాక్ చేసి ఉన్నారు.
ఆ కాలనీ లకు చెందిన నివాసులు రాకపోకలు మరియు వాహనాల రాకపోకలు ఇబ్బందిగా అనిపిస్తుంది.
కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరిగాయి.కావున జడ్డంగి పంచాయితీ కి చెందిన పంచాయితీ కార్యదర్శి మరియు స్థానిక సర్పంచ్ హైవే కాంట్రాక్టర్స్ తో మాట్లాడి వీధుల్లోకి వెళ్ళే రోడ్స్ లను క్లియర్ చెయ్యాలి అని సమాచారం ఇవ్వాలని అలాగే రాకపోకలు ఇబ్బంది కరంగ ఉన్నాయి అని గమనించాలి అని అక్కడ గ్రామస్తులు కోరారు.