మహాశక్తి కార్యక్రమాన్ని గడపగడపకు చేరువ చేయండి.: కోరాడ రాజబాబు

 మహాశక్తి కార్యక్రమాన్ని  గడపగడపకు చేరువ చేయండి.: కోరాడ రాజబాబు

భీమిలి వి న్యూస్ జులై 20

భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందించిన మహాశక్తి కార్యక్రమాన్ని భీమిలి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు  అధ్యక్షతన నియోజకవర్గ మహిళ నాయకురాలతో సమావేశమై మహాశక్తి కార్యక్రమం యొక్క విశిష్టతను పార్టీ కార్యక్రమం పై తీసుకున్న ప్రాధాన్యతను వివరిస్తూ మహిళలకు తెలుగుదేశం పార్టీ రూపొందించినటువంటి మహాశక్తి మ్యానిఫెస్టో యొక్క ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారికి కలిగే ప్రయోజనాలను వారు తెలుసుకునే విధంగా ప్రతి పల్లెలో గడపగడపకు చెరువు చేసి మహాశక్తి ప్రచారం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది .

ఈ కార్యక్రమంలో వారితోపాటు రాష్ట్ర మహిళా ఉప అధ్యక్షురాలు కురుమిన లీలావతి  నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి  విశాఖ పార్లమెంట్ తెలుగు మహిళ ఆర్గనైజింగ్ సెక్రటరీ సీతాపతి మంగాదేవి  నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు వాసుపల్లి పోలమ్మ  జీవీఎంసీ రెండో వార్డ్ మహిళా అధ్యక్షురాలు రెక్క సత్యవతి తదితర నియోజకవర్గ మహిళా నాయకురాలు అందరూ పాల్గొనడం జరిగింది.