సమాజానికి హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం
డి.పి.ఆర్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు:డాక్టర్ డి శ్రీను
కృష్ణా జిల్లా:వి న్యూస్ : జూలై 24:
గన్నవరం ప్రాంతంలో హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో స్పందన మానసిక వికాస కేంద్రం లో దివ్యాంగులకు చేస్తున్న సేవలను డి.పి.ఆర్.టి.యు,సేవా దళ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి శ్రీను ప్రశంసలు కురిపించారు.విజయవాడ గాంధీనగర్ లో సోమవారం నాడు డి.పి.ఆర్.టి.యు రాష్ట్ర కార్యాలయంలో హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్,కృష్ణా జిల్లా దివ్యాంగుల హక్కుల పరిరక్షణ అడ్వైజరీ బోర్డు మెంబర్ సంకాబత్తుల వెంకట్ చేస్తున్న సేవలకు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి.శ్రీను మాట్లాడుతూ ఈ సమాజానికి సంకాబత్తుల వెంకట్ లాంటి సామాజిక వేత్తలు సేవలు అత్యంత అవసరమని,సమాజానికి ఎటువంటి స్వార్ధం లేకుండా ఎంతో నిస్వార్ధంగా చేస్తున్న సేవలు చాలా గొప్పవని ముఖ్యంగా దివ్యాంగులకు అద్బుతమైన సేవలను చేస్తున్నారని దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి స్పందన మానసిక వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా విద్యా వైద్య రవాణా భొజన సౌకర్యాలు అందించడమే కాకుండా దివ్యాంగులకు ఏ కష్టం వచ్చిన నేను ఉన్నానని వెంటనే స్పందించి సేవలు చేస్తున్న సంస్థ చైర్మన్ సంకాబత్తుల వెంకట్ ను డి.పి.ఆర్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీను అభినందించారు.దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పధకాలు మరియు వికలత్వం నివారణకు పై అవగాహన కల్పించడం,సదరమ్ సర్టిఫికేట్ అప్లై చెయ్యడంలో తగిన గైడ్ చెయ్యడం లో ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుందని,కరోనా క్లిష్టమైన పరిస్థితులలో వేలాదిమందికి సహాయం చేసిన ఘనత హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్ కు దక్కుతుందని,ఇలాంటి సంస్థలకు తోడ్పాటు అందించడం సామాజిక బాధ్యతని,సమాజానికి చేస్తున్న సేవలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని స్పందన మానసిక వికాస కేంద్రానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని,హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చేస్తున్న సేవాకార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా శ్రీను తెలియజేశారు.ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్ డి.పి.ఆర్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి.శ్రీను కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర డి.పి.ఆర్.టి.యు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు మరిదు నాగేంద్ర రావు,మండల సెక్రటరీ డి.రామ్ సింగ్ నాయక్,యం.టి.ఎస్ టీచర్స్ నాయకుడు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.