నగరంలో పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత జివిఎంసి కమిషనర్ సీ ఎం సాయికాంత్ వర్మ.

నగరంలో పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత

జివిఎంసి కమిషనర్ సీ ఎం సాయికాంత్ వర్మ

విశాఖపట్నం, జూలై-21:- 

నగరంలో పలు పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత

ఇస్తున్నట్లు జివిఎంసి కమిషనర్ సీ ఎం సాయికాంత్ వర్మ పేర్కొన్నారు.

శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా 2, 3 జోనల్ పరిధిలోని

ఎండాడ, సాగర్ నగర్, ఎంవిపి కోలనీ తదితర ప్రాంతాలలో అభివృద్ధి పరచనున్న

పార్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు సేద

తీరేందుకు పార్కులు ఎంతో అవసరమని నగరంలోని ప్రతి ప్రాంతంలో పార్కులను

అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ముఖ్యంగా వృద్ధులు,

పిల్లలు, వివిధ ప్రతిభావంతులుతో పాటు అన్ని వయసుల వారికి ఉపయోగపడే విధంగా

ప్లే గ్రౌండ్లు, జిమ్ము, వాకింగ్ ట్రాక్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని

తెలిపారు. ఎండాడ వైఎల్పి లే-అవుట్ ప్రాంతంలో పామ్ దీమ్ పార్కు కొరకు

సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. అలాగే

ఎంవిపి కాలనీ ఏ ఎస్ రాజా స్టేడియం ఎదురుగా కోటి రూపాయల వ్యయంతో పార్కును

అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, అలాగే ఎంవిపి లో

సెక్టార్-6 వద్ద గల ఏనుగుల పార్క్ నిర్వహణ, పారిశుధ్యం సరిగా లేనందున

పార్కును శుభ్రపరచాలని ఆదేశించారు. సాగర్ నగర్ తదితర ప్రాంతాలలో పారిశుధ్య

నిర్వహణ సరిగా లేదని, దగ్గరుండి  పారిశుద్ధ్య పనులు పరివేక్షించాలని

ఏఎంఓహెచ్ డాక్టర్ ఎన్ కిషోర్ ను ఆదేశించారు.

  ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజనీర్లు సత్యనారాయణ రాజు, శ్యాంసన్

రాజు, కార్యనిర్వాహక ఇంజనీర్లు శ్రీనివాస్, ప్రసాద్, ఉప కార్యనిర్వాహక

ఇంజనీర్ వంశీ తదితరులు పాల్గొన్నారు.