సమాజ సేవలో అశేష్ .... తల్లిదండ్రులు చూపిన బాటలో తన అడుగులు... రాజమండ్రి : వి న్యూస్ జూలై 19
కరోనా సమయంలో ఆకలికి అలమటించిన వారేందరూ... అలాంటి వారికిప్రపంచ వ్యాప్తంగా , దేశ వ్యాప్తంగా కొందరూ తమ వంతుగా ఏదో ఓ సాయం అందించడం మనం చూశాం... అలాంటి కోవకే చెందిన ఓ కుటుంబం దాన్ని తన కుమారుడితో కలిసి క్రమం తప్పకుండా ఆకలితో ఉన్న వారికి తమ వంతు సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన కంభం పాటి రామారావు, ప్రియ దంపతులు కుమారుడు కౌటిల్య నాలుగు సంవత్సరాల క్రితం కరోనా సమయంలో బిక్షాటన చేసే వారితో పాటు రోడ్డు పక్కన సంచార జీవితం గడిపే వారికి తమ వంతుగా ఆహారం ప్యాకెట్లు తయారు చేసి పంపిణీ చేశారు.
కరోనా సమయం పూర్తి అయిన తరువాత ఆ అలవాటును తమ కుమారుడు అశేష్ కౌటిల్య కు రావాలని మన వద్ద ఉన్న దాంట్లో పది మందికి సాయం చేయాలనే ఉద్దేశ్యం కల్పించాలని కుమారుడి పుట్టిన రోజు, పండుగలు, దంపతులపెళ్లి రోజు, వారి పుట్టిన రోజు న క్రమం తప్పకుండా గత నాలుగు సంవత్సరాలుగా వారి వంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారిని పలుకరిస్తే ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలు ఆయా రంగాల్లో అంటే పెయింటిగ్, సాంగ్స్ ,చదువు, క్రీడల్లో రాణించాలని ప్రొత్సహిస్తుంటారు. అదే విధంగా మా బాబుకు సైతం ఇలా పది మందికి సాయపడే విధంగా ప్రొత్సహిస్తున్నామని, తనలో కూడా పది మందికి సాయం చేయాలనే ఉత్సాహాన్ని మేము గుర్తించామని తెలుపుతున్నారు. . దీంతో మేము మా వంతుగా ఎంత చేయగలమో అంతా చేస్తూ ముందుకు వెళుతున్నాము....