గంగ మీసేవ సి ఎస్ సి సెంటర్ సందర్శించిన బీజేపీ నేతలు.
ఆనందపురం:వి న్యూస్ జులై 21:
గంగ మీసేవ సి.ఎస్.సి.( CSC) సర్వీసెస్ ను విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్,ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యవసాయ రైతులకు సంబంధించిన,పిఎం కిసాన్, ఈ-కేవైసీ (E-Kyc.) ఆధార్ లింక్, కేంద్ర ప్రభుత్వ పథకాలు సంబంధించిన,అన్ని సర్వీసులు అందుబాటులో ఉంటాయని,గంగ మీసేవ ద్వారా,బ్యాంకింగ్ సేవలు ఆనందపురం మండలంలో ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,సిఎస్ సి(CSC) కో-ఆర్డినేటర్ శివ, కామన్ సర్వీసెస్ సెంటర్ ఆపరేటర్ గంగాధర్,మీసాల పైడి నాయుడు పాల్గొన్నారు.