పేదలకు మేలు చేయడమే జగనన్న సురక్ష కార్యక్రమం లక్ష్యం అంటున్న అవంతి

పేదలకు మేలు చేయడమే జగనన్న సురక్ష కార్యక్రమం లక్ష్యం అంటున్న అవంతి

భీమిలి :వి న్యూస్ : జూలై 01

భీమిలి నియోజకవర్గం - మదురవాడ జోన్ 5వ వార్డు (బోరవానిపాలెం) - జీవియంసి 89 వ వార్డు (ఎల్లపువాని పాలెం) - జీవియంసి భీమిలి జోన్ - తగరపువలస బంతాట మైదానం  శనివారం రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి మేలు చేయాలనే మంఛి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జగనన్న సురక్ష అనే వినూత్న కార్యక్రమం కి శ్రీకారం చుట్టడం జరిగిందని ముఖ్యమంత్రి ఆదేశాలతో అవంతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు చిట్టివలస అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ బైక్ ర్యాలీ తో ఊరేగింపు గా వెళ్ళి బంతాట మైదానంలో జగనన్న సురక్ష కార్యక్రమం ఘనంగా ప్రారంబించడం జరిగింది.

*కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదవాడు ఎలా ఉన్నా మనకెందుకు లే అనుకొని పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఉండేదని , ప్రతీ పేదవాడికి మంచి జరగాలన్న తపన , తాపత్రయం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి  అని గత ప్రభుత్వాలు పాలనలో ఏ పనులు చేయాలన్నా ,ఎలాంటి పథకాలు కావాలన్నా అవినీతి రాజ్యమేలి లంచాలు ఇస్తూ లంచ గొండిలు చుట్టు ప్రజలు పేదలు బుడుగు బలహీనుల వర్గాల వారు ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేదని జగనన్న పాలన లో అర్హతే ప్రామాణికం అని , కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా రాజకీయాలకు తావు లేకుండా ఎక్కడా ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా వివక్ష అనే దానికి ఇవ్వకుండా పారదర్శకంగా రాజకీయ చరిత్ర లో పౌర సేవలు అందించడం దేశంలో ఒక్క వైసిపి ప్రభుత్వం లోనే మొదలైందని. అందులో భాగంగా నేడు జనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్రం అంతటా ఓ మహాద్యమం లా సాగుతుందని, జగనన్నకు చెబుదాం కార్యక్రమం కు మరో ప్రయత్నం ఈ జగనన్న సురక్ష కార్యక్రమం అని రాష్ట్రంలో 99 శాతానికి పైగా అర్హులందరికీ పథకాలు అందుతున్న పరిస్థితి ఉంది అయినా సాంకేతిక కారణాలు వలనో మరే ఇతర కారణాలు వలనో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంకా ఎక్కడైనా మీడియా ఒక్క శాతం మంది కూడా మిగిలిపోయే పరిస్థితి రాకూడదని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి లక్షలాది కుటుంబాల ప్రయోజనం శ్రేయస్సే జగనన్న లక్ష్యం అని పేదల పట్ల ఇంత బాధ్యత శ్రద్థ ప్రేమ ను మమకారం చూపిస్తున్న వైసిపి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఎక్కడా ఉండబోదని ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా భీమిలి నియోజకవర్గం లో ఈ నెల రోజులు యంయల్ఏ గా నేను నాతో పాటు నాయకులు ప్రభుత్వ అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు గృహ సారథులు బాధ్యత తో ప్రతీ ఇంటికి వెళ్ళి సమస్యలు అడిగి జల్లెడ పట్టి తెలుసుకుని పరిష్కారం చేయడానికి అడుగులు వేయడం జరుగుతుందని దీని వలన ప్రభుత్వ పాలనపై ప్రజలకు మంచి సేవలు అందించడం తో పాటు జగనన్న పాలన పేదల కళ్ళల్లో ఆనందమే చూడటం కోసం అని అందరికి తెలిస్తుందని ప్రతీ ఒక్కరు జగనన్న సురక్ష కార్యక్రమం ని భాద్యత గా తీసుకుని విజయ వంతం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  లక్ష్యం నెరవేర్చాలని పిలుపునిస్తూ మాట్లాడారు.* 

అనంతరం గడప గడపకు తిరిగి జగనన్న సురక్ష కార్యక్రమం లో కనుగొన్న 11 సమస్యలు పరిష్కారం చేసి సర్టిఫికెట్ లు అవంతి చేతులు మీదుగా మదురవాడ 5వ వార్డు - జీవియంసి 89 వ వార్డు - తగరపువలస లో లభ్థిదారులకు అందివ్వడం జరిగింది*

*ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం వైసిపి శ్రేణులు సచివాలయ కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు*