నగ్న ప్రదర్శన చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి - గిరిజన సంఘం ఆదివాసి మహిళా సంఘం సిఐటియు

నగ్న ప్రదర్శన చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి - గిరిజన సంఘం ఆదివాసి మహిళా సంఘం సిఐటియు

అల్లూరి సీతారామరాజు జిల్లా :వి న్యూస్ జూలై 21 :-

సభ్య సమాజం తలదించుకునేలా మణిపూర్ లో ఇద్దరు కుకీ మహిళలకు అత్యంత అవమానంగా దుర్మార్గంగా నగ్న ప్రదర్శన చేయించిన ఉన్మాద అల్లరి మూకలకు కఠిన చర్య తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆదివాసి మహిళా సంఘం సిఐటియు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది.

ఆదివాసి గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్ ఆదివాసి మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

ఎస్.హైమావతి మాట్లాడుతూ.....

గత రెండు మాసాలుగా మణిపూర్ రాష్ట్రంలో హింసకాండ అల్లర్లతో అట్టడుకుతుందని కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నడి రోడ్డుపై నగ్నంగా నడిపించడం సామూహిక అత్యాచారానికి పాల్పడడం అత్యంత హేమమైన చర్యని ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం చర్య తీసుకోకుండా ఉన్మాద అల్లరి మూకలకు అప్పగించడం అన్యాయమని డబల్ ఇంజన్  సర్కార్ బిజెపి మహిళలపై అత్యాచారాలు అరాచకాలు జరుగుతున్న రెండు నెలల నుండి కనీసం స్పందించకపోవడం అత్యంత దారుణమని ఈ సంఘటన 2023 మే 4 జరిగినప్పటికీ అరాచకముకలకు కాపాడుందుకే బిజెపి ప్రభుత్వం ఈ విషయం బయటకు రానీయకుండా దాచి పెట్టిందని సోషల్ మీడియాలో దుర్మార్గమైన వీడియో ప్రచారంలో కొచ్చినాక దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలిన నేపథ్యంలో బిజెపి బీరేన్ సింగ్,నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్య తీసుకుంటామని ప్రకటించడం పచ్చి దుర్మార్గమని మణిపూర్ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసి గిరిజన సంఘం మహిళా సంఘం డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎల్ సుందర్రావు మహిళా సంఘం నాయకులు ఈశ్వరి సుబ్బలక్ష్మి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కే మసియా శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.