గోదావరిలో భారీ వరద సంఖ్య జపాతం నమోదు

 అల్లూరి జిల్లా,దేవీపట్నం పెన్ షాట్ న్యూస్ జులై 22 :-


గోదావరిలో భారీ వరద సంఖ్య జపాతం నమోదు

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు కారణంగా గోదావరిలోకి అధిక సంఖ్యలో వరద నీరు చేరింది అని దేవీపట్నం ఎస్ఐ మీడియాకు తెలియజేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గం దేవీపట్నం మండలం పరిధిలో గోదావరి పరిహార ప్రాంతాల్లో పోలీస్,రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమయ్యామని గోదావరి పరిహార ప్రాంతాలకు ఎవ్వరు రావద్దని అధికారులు ప్రజలకు తెలియజేస్తున్నారు.

మాతృశ్రీ గండి పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులు ఎవరు కూడా అమ్మవారి టెంపుల్ వద్దకు రావద్దని ప్రస్తుతం తాత్కాలికంగా అమ్మవారి ఆలయం మూసివేయడం జరిగిందని ఆలయ అధికారులు చెప్పారు.

గోదావరి పరిహార ప్రాంతాల వద్ద రంపచోడవరం ఏ ఎస్ పి జగదీష్ హడహళ్ళి, సిఐ రవిబాబు, దేవీపట్నం ఎస్సై కేవీ నాగార్జున తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్సై నాగార్జున తెలియజేశారు.