భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం దుకాణాలు వద్ద బహిరంగంగా మద్యం సేవించడం నేరం అనే బోర్డులు ఏర్పాటు చేసిన భీమిలి సిఐ.డి. రమేష్.
భీమిలి వి న్యూస్ జులై 24
బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడం అది చట్టపరంగా నేరమని సోమవారం తగరపువలస అన్ని మద్యం దుకాణాలు వద్ద బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడం నేరం అనే ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసారు. కొంతమందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.మరియు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన వారిపై కేసులు నమోదు చేసామని అన్నారు.ఇకపై భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే వాళ్లపై చట్టపరమైన కేసులు పెడతామని, సిఐ, డి రమేష్ తెలిపారు.