చెరువును తలపిస్తున్న కొత్తపాలెం నుండి సబ్బవరం వెళ్లే రహదారి.

చెరువును తలపిస్తున్న కొత్తపాలెం నుండి సబ్బవరం వెళ్లే రహదారి.              

కొత్తపాలెం : వి న్యూస్ : జూలై 24: 

సుమారు రెండు మూడు నెలల నుంచి కొత్తపాలెం నుండి సబ్బవరం వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి కొద్దిపాటి చిన్న వర్షానికే చెరువులా రహదారి పై నీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ రహదారి రోడ్డు పూర్తిగా పాడైపోయింది అలాగే ఎక్కడ చూసినా గొయ్యి మాత్రమే కనబడుతుంది. ఇదే రహదారి వైపు ఎందరో మంది ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది వెళ్తున్న పట్టించుకోవట్లేదని ప్రజలు తెలుపుతున్నారు. రహదారికి ఇరువైపులా పెద్ద పెద్ద నిర్మాణాలు చేసి నీరు డ్రైనేజీలోకి వెళ్లే విధమైన చర్యలు తీసుకోక పోవటం వల్ల రోడ్లు పూర్తిగా గోతులమయం అవ్వటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంటున్నారు.ఇప్పటికైనా అధికారి పనితీరు మార్చుకొని వెంటనే ఈ రోడ్డు నిర్మించాలని ప్రజల కోరుకుంటున్నారు.