బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసిన పీతల మూర్తి యాదవ్...

 బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసిన పీతల మూర్తి యాదవ్...

విశాఖపట్నం, వి న్యూస్  జూలై 19:  

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ దగ్గుపాటి  పురందేశ్వరిని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విజయవాడలో బుధవారం కలిసి అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి బిజెపి జనసేన కలిసి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె సూచించినట్టు మూర్తి యాదవ్ తెలిపారు. 

ఇరు పార్టీల పొత్తు నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో జనసేన బిజెపితో   కలిసి పోటీ చేయనున్నామని  ఆయన వెల్లడించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో  పురందేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు.