కౌన్సిల్ సమావేశంలో మధురవాడ పాదచారుల వంతెన కొరకు తన గళం వినిపించిన కార్పొరేటర్ ప్రియాంక

కౌన్సిల్ సమావేశంలో మధురవాడ పాదచారుల వంతెన కొరకు తన గళం వినిపించిన కార్పొరేటర్ ప్రియాంక 

విశాఖ: వి న్యూస్ :జులై 25:

విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నందు జీవీఎంసీ చీఫ్ విప్ మరియు 6వ వార్డ్  కార్పొరేటర్ డా. ముత్తంశెట్టి. ప్రియాంక  మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద పాఠశాల విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు రోడ్డు దాటుటకు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇటీవల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన పాదచారుల వంతెన  నిర్మించాలని ఈ కౌన్సిల్ సమావేశంలో జీవీఎంసీ కమీషనర్ కి విన్నవించారు.