గడప గడప కార్యక్రమానికి బ్రేక్

గడప గడప కార్యక్రమానికి బ్రేక్

జర్రెల గ్రామం: వి న్యూస్ : జూలై 24:

అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్త వీధి  మండలం,జర్రెల పంచాయితీ, జర్రెల గ్రామంలో సోమవారం నాడు  పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే

కొత్తగుల్లి భాగ్యలక్ష్మి  జర్రెల పంచాయితీ లో ఉన్న గ్రామాల్లో గడప గడప కార్యక్రమం జరిగింది. వాతావరణం సహకరించకపోవడంతో జర్రెల పంచాయతీ  లో ఉన్న కొండ్రుపల్లి,చింతలవాడ, రాళ్ళగెడ్డ,రాసకోట,

జే కొత్తూరు గ్రామాలలో  మాత్రమే గడప గడప కార్యక్రమాన్ని చేశారు. అయితే పూర్తి వివరాల్లోకి వెళితే......

గూడెం కొత్తవీధి మండలం, జర్రెల పంచాయితీ కు చెందిన  జర్రెల కొత్తూరు గ్రామానికి మాత్రం గడపగడప కార్యక్రమాన్ని జరగలేదు. ఇంకా ఆ ఊరు గ్రామస్తులు  మా గ్రామానికి రాగానే మా సమస్యలన్నీ చెప్పుకోవడానికి అవకాశం మా నియోజకవర్గ ఎమ్మెల్యేతో దొరికిందని అనుకున్నారు.  కానీ ఆ గ్రామానికి వెళ్లకుండానే వెనక్కి వెళ్ళిపోయారని  గ్రామస్తులు వాపోయారు.

జనసేన పార్టీ వార్డ్ మెంబర్ అయిన విష్ణుమూర్తి మాట్లాడుతూ....

మా గ్రామానికి రాకుండానే వెనక్కి వెళ్లడానికి కారణం ఏంటని? మేమేం ఏమి పాపం చేసాం?  మా సమస్యల్ని మీరు పట్టించుకోరా?

మా ఈ ప్రశ్నల్ని మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

గత కొంతకాలంగా మా గ్రామానికి రోడ్డుతో పాటు వంతెన సౌకర్యం కల్పించాలని ప్రజా ప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు కూడా వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము.  కానీ ఇప్పటికి కూడా ఏ ఒక్క నాయకులు,  ఉన్నతాధికారులు స్పందించడం లేదు.

వరద ఉంది అని కారణం చెప్పి మా గ్రామానికి రాకుండా వెనక్కి వెళ్ళిపోయారు.  అలాంటప్పుడు...

ఇలాంటి వర్షాకాలంలో మా పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించారా? అని అన్నారు.  అత్యవస పరిస్థితి వస్తే మాకు చావే గతి తప్ప ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందే అవకాశమే లేదు. ఇప్పటికైనా మా గ్రామానికి వచ్చి మా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే మార్గాన్ని చూడాలని అన్నారు