మాజీ మంత్రి ఆదేశాలతో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమం

 మాజీ మంత్రి ఆదేశాలతో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమం

మధురవాడ వి  న్యూస్ జులై 19

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు  గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ బాబు ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని గల 17 వార్డులకు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయం లో  నిర్వహించబడింది. ఈ కార్య క్రమంలో భాగంగా బూతు స్థాయిలో ఓటర్ వెరిఫికేషన, మన టిడిపి యాప్ మరియు ఆర్టియస్ లపై ట్రైనింగ్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి విజయ్ బాబు మాట్లాడుతూ 

ఈ నెల 21వ తేదీ నుంచి బూతు స్థాయిలో బిఎల్వోలు ఇంటింటికి ఓటరు నమోదు మరియు చేర్పులు మార్పులు కార్యక్రమం పై మరియు ఓటర్ లిస్టు వెరిఫికేషన్ పై వచ్చేదరని సదరు బి ఎల్ ఓ లతో మన బి ఎల్ ఏ లు కూడా కలిపి సదరు ఓటర్ వెరిఫికేషన్ లో పాల్గొని మన ఓట్లు డిలీట్ అవ్వకుండా మనకు సంబంధించి ఏవైనా ఓట్లు పోయినట్లయితే చేర్పించడం వంటి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ముఖ్య నాయకులు రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇంఛార్జిలు, యూనిట్ ఇంఛార్జిలు, బూత్ కన్వీనర్లు మరియు వార్డు కమిటీ సభ్యులు  పాల్గొన్నారు.