గాయపడిన విద్యార్థులకు సహాయం అందజేసిన డి.వి.రామరాజు దంపతులు
మధురవాడ వి న్యూస్ జులై 20
చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు సీతమ్మధార వాస్తవ్యులు ( మారికివలస హిమామి ఐస్ ప్లాంట్ యజమాని) డి.వి. రామరాజు, సూర్య భాస్కరయ్యమ్మ దంపతులు గాయపడిన సుమంత్, దినేష్, రాజేష్ ల తల్లిదండ్రులకు చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు యమ్.రాజబాబు, కమిటీ సభ్యులు సమక్షంలో సూర్య భాస్కరయ్యమ్మ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.,
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యమ్.రాజబాబు, పాఠశాల కమిటీ చైర్మన్ బి. మీనా, కమిటీ సభ్యులు పిళ్లా సూరిబాబు, యన్.జ్యోతీష్, పి.డి.రాము, ఉపాధ్యాయులు కె.శ్రీనివాసరావు, ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు.