మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైకాపా తీరు..!భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి
భీమిలి పెన్ షాట్ జులై 19
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై దాడులు పెరిగాయని, మైనర్ బాలికలు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో హత్యలకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి ఆవేదన వ్యక్తం చేసారు.మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బుధవారం భీమిలిలో ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా భీమిలి గ్రామాదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని నిర్వహించారు. శ్రీ నూకాలమ్మ ఆలయం నుండి భీమిలి ప్రభుత్వ ఆసుపత్రి, గంటస్థంభం, మెయిన్ రోడ్డు, పాత బస్టాండ్ మీదుగా చిన్న బజార్ జంక్షన్లో ఉన్న అన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో బోయి రమాదేవి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రశాంత ఆంధ్రప్రదేశ్ ను హత్యాంద్రప్రదేశ్ గా మార్చారని ఎద్దేవా చేసారు. ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, మైనర్ బాలికలపై దాడులు అనే వార్తలు నామనసుని కలసివేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలను ఎంతో గౌరవించే ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..? అని ప్రశ్నించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో వందల సంఖ్యలో మహిళలపై హత్యా ప్రయత్నాలు జరిగాయని కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి చర్యలు లేకపోవడం మహిళలు తలదించుకొనేలా ఉందని వాపోయారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా, పక్కా సాక్ష్యాదారాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రతీ సంఘటనలో వైసిపీ గూండాల హస్తం ఉండటం వలన వారిపై చర్యలకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని అన్నారు. ఐదుగురు వైసిపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలపై ఆరోపణలు ఉన్నాయని వారిపై చర్యలు తీసుకొని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని అన్నారు. ఇంకా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి, జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి శతపతి మంగాదేవి తదితరులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు వాసుపల్లి పోలమ్మ, నందిని, పుక్కళ్ళ లక్ష్మీ కుమారి, పైడిపల్లి ఎల్లయ్యమ్మ, ఆర్. సత్య మరియు జిల్లా, నియోజకవర్గం,మండల, పట్టణం నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.