స్వాతంత్ర్య సమరయోధుల భూములను కాపాడాలి..

స్వాతంత్ర్య సమరయోధుల భూములను కాపాడాలి..


పెట్రేగిపోతున్న ల్యాండ్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కు బాధితుల  విజ్ఞప్తి.... 

స్వాతంత్ర  సమరయోధులకు ఇచ్చిన  భూములను కబ్జా చేయడానికి ల్యాండ్ మాఫియా , చోటా నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు . వీటిపై  పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదులు అందడంతో భూముల్లో  అక్రమంగా వేసిన  కర్రల దడిని పోలీసులు హెచ్చరికలతో  కబ్జాదారులు తొలగించారు. కొంతమంది  ల్యాండ్ మాఫియా  , చోటా నేతల  అండతో తిరిగి సమరయోధుల భూములను కబ్జా చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

పద్మనాభ మండలంలోని బర్లపేట గ్రామం, సర్వే నంబర్ 42/1, 42/2లో మొత్తం ఎకరములు  12.10 సెంట్లు భూమిని స్వాతంత్ర్య సమరయోధులకు 1989, ఆగస్టు 15న నాటి ప్రభుత్వ అధికారులు గ్రామ సభ నిర్వహించి, ఆనాటి శాసనసభ్యులు, ఎమ్మార్వో, మిగిలిన ప్రజా ప్రతినిధుల సమక్షంలో  , ప్రభుత్వ సర్వేయర్లు   భూమి చుట్టూ కొలతలు కొలిచి మట్టి గట్లు వేసి ,  భూమి పట్టాలను అధికారికంగా అందజేశారు. వెంటనే అధికారులు , ప్రజా ప్రతినిధులు  అక్కడక్కడ  కొన్ని మామిడి మొక్కలు నాటారు .  ఆ భూమిలో కొండ రాళ్లు , ముళ్ళ కంచెలు, పిచ్చి మొక్కలు , మట్టి దిబ్బలు మొదలగు వాటితో నిండి ఉండగా,  సమరయోధులు  ఆ భూమిని చదును చేసి మామిడి , జీడి, టేకు, సీజనల్  పంటలైన కందులు, మినుములు, పెసలు ,ఉలవలను వేసి వాటి ఫల సాయంతో జీవనం సాగిస్తున్నారు.  ఈ భూమిలో సమరయోధుల కుటుంబీకులు తప్ప, ఇప్పటి వరకు బయట వారు ఎవరు సాగు చేయలేదు.  ఆజాది క అమృత్ మహోత్సవ  సందర్భంగా సమరయోధుల  కాంస్య విగ్రహాలను వారి  కుటుంబీకులు ప్రతిష్టించి , వారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను జరుపుతున్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవముల పంపిణీ , మహిళలకు చీరలు, దుప్పట్లు  పంపిణీ మరియు ఉచిత వైద్య శిబిరములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల,  సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు , జాతీయ పర్వదినాలు ,  పేద విద్యార్థులకు నోట్ పుస్తకములు , పలకలు , పెన్లు ,  పెన్సిల్లు మండలంలోని కొన్ని పాఠశాలలకు అందజేస్తున్నారు . మరియు యువతకు శారీర వ్యాయామం కోసము , మానసిక ఉల్లాసం కొరకు వీరిని క్రీడాకారులుగా తీర్చిదిద్దుట కొరకు వీరి కోసము క్రీడ పరికరములను వాలీబాల్ , ఫుట్ బాల్ , షటిల్ బ్యాట్లు , క్యారం బోర్డ్స్ ,  నెట్స్ మొదలగునవి పంపిణీ చేశారు . ఈ  భూమి నందు 

సహృదయులు అయిన   అధికారులు మరియు  సామాజిక సేవకులు , దాతల సహకారంతో చిన్న వైద్యశాల నిర్మించి , పేద  ప్రజలకు ఉచిత వైద్యం మరియు దివ్యాంగులైన బాలబాలికల కోసము శిక్షణ పాఠశాల  , అనాధలైన వృద్ధుల కోసం వృద్ధ ఆశ్రమము  నిర్మించాలని  సమరయోధుల కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు.  ఇటీవల భూ కబ్జాదారులు, చోట నేతల  సహకారముతో గ్రామస్తులతో  కలిసి ఒక పథకం ప్రకారము భూమిని కబ్జా చేయాలని, నకిలీ పత్రాలు సృష్టించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


భూ కబ్జాపై  సీపీకి ఫిర్యాదు... 

ఈ నేపథ్యంలో   సమరయోధుల కుటుంబీకులు  స్పందనలో  నగర పోలీసు కమిషనర్ కి  ఫిర్యాదు చేశారు. స్పందించిన సిపి, ఫిర్యాదును పద్మనాభం పోలీసులకు బదలాయించి, విచారణ చేసి కబ్జాదారులపై  చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో పద్మనాభం  పోలీసులు  సమరయోధుల కుటుంబీకులను, కబ్జాదారులను  స్టేషన్ కి పిలిపించి  విచారించారు. సమరయోధుల కుటుంబీకుల వద్ద భూమి హక్కు పత్రాలను పోలీసులకు చూపించగా, కబ్జాదారుల వద్ద  ఎటువంటి  పత్రాలు లేకపోవడంతో వారిని కఠినంగా మందలించి   , మరల కబ్జాకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో వారు భూములలో అక్రమంగా వేసిన  కర్రల దడిని  తొలగించారు.

సమరయోధులకు  భూములను అమ్ముకునే హక్కు ఉంది...

ఇదిలా ఉండగా  సమరయోధులకు ప్రభుత్వం కేటాయించిన  భూములను పదేళ్లు దాటిన తర్వాత, వాటిని అమ్ముకొనుటకు  బదలాయించుటకు హక్కు ఉందని 2016లో  జూలై 4న స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి రోజున  రాష్ట్ర ప్రభుత్వం  జీవో (నెంబర్ 279) విడుదల చేసింది.  గతంలో ప్రభుత్వ విడుదల చేసిన ప్రొహిబిషన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ యాక్ట్ స్వాతంత్ర సమరయోధులకు, మాజీ సైనికులకు వర్తించదు. అలాగే ఈ భూమిపై  కుటుంబ వారసులు  ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఆర్డర్ పొంది ఉన్నారు.  ప్రభుత్వ పథకాలైన  నవరత్నాలు, జగన్ అన్న ఇల్లు, తదితర వాటికి  సమరయోధుల భూములను వినియోగించ రాదని, అలాగే అనుమతి లేనిదే ఇతరులు భూమి లోపలకి ప్రవేశించరాదని పై ఆర్డర్ స్పష్టం చేసింది...