ప్రభుత్వ పథకాలు వినియోగించుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలి : రిటైర్డ్ ప్రిన్సిపాల్
మధురవాడ వి న్యూస్ జులై 19
జీవీఎంసీ జోన్ టు పరిధిలోని మధురవాడ 7వ వార్డ్ వాంబే కొలనిలో సునీతశర్మ కోలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ని రిటైర్డ్ ప్రిన్సిపాల్ మార్తాండం బుధవారం సందర్శించారు.
పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి సందర్భంగా మాట్లాడుతూ చాలా అభివృద్ధి చెందాయి ప్రభుత్వ పాఠశాలలు యని, విద్యార్థులు చక్కగా చదువుకుని ప్రభుత్వ పథకాలు వినియోగించుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని కోరారు. శతశాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు జి. శాండిల్య కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.