భీమిలి పోలీస్ స్టేషన్ పరిధి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ డి రమేష్.
భీమిలి: వి న్యూస్ : జూలై 16:
భీమిని పట్టణం పోలీస్ స్టేషన్ సిఐ. డి. రమేష్ ఆదివారం భీమునిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ అందరినీ పోలీస్ స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్లో రౌడీ షీటర్లకి మునుముందు ఎలక్షన్స్ వస్తుండా సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యల్లో పాల్గొనకూడదని అలాగే ఎలాంటి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన సరే కఠిన చర్యలు చట్టపరంగా తీసుకుంటామని వాళ్ళందరూ సత్ప్రవర్తనతో మెలగాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని చేతిలో తీసుకొని ఏమైనా క్రిమినల్ చర్యలు చేస్తే ఉపేక్షించేది లేదని భీమిలి సిఐ డి రమేష్ రౌడీ షీటర్లను హేచ్చరించారు.