విశాఖ జిల్లా కిసాన్ మోర్ఛ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పనులు పరిశీలన:-
భీమిలి వి న్యూస్ జులై 15
భీమిలీ మండలంలో శనివారం పలు గ్రామాలలో పర్యటించి జాతీయ ఉపాధి హామీ పథకం పనులు పరిశీలించిన బిజేపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్. భీమిలి మండలంలో తాలవలస గ్రామ లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా (ఎన్ ఆర్ ఈ జి ఏ) వందమంది వ్యవసాయ కూలీలతో మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పని కల్పించడమే ఈ పథకం యొక్క లక్ష్యం మనీ, గ్రామీణ ప్రాంతాలు వారు,వలసలు వెళ్ళకూడదని,ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం అని,భీమిలి మండలంలో ఈ పథకం బాగా అమలు జరుగుతుందని ,వ్యవసాయ కూలీలు,గుర్తించి భీమిలి మండలం తో పాటు ఉచితంగా భీమిలి నియోజకవర్గం లో పలు గ్రామాల్లో వ్యవసాయ కార్మికులుకు ఈ- శ్రమ్ కార్డులు కూడ నమోదు చేయడం జరిగిందని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు జరుపుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి, ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు,చెట్ల రమణమ్మ చిల్ల లక్ష్మి చిల్ల ప్రియoక,బోని ఉష రాణి,కాకర అప్పారావు,మల్లారపు కృష్ణ, మరియు బిజేపి మండల కిసాన్ మోర్చ నాయకులు పాల్గొన్నారు.