తుగ్లక్ సర్టిఫికెట్ వ్యవస్థను మార్చాలి - బిజెపి

తుగ్లక్ సర్టిఫికెట్ వ్యవస్థను మార్చాలి - బిజెపి

అల్లూరి జిల్లా,రంపచోడవరం పెన్ షాట్ న్యూస్ జూలై 1 :-

వైసిపి ప్రభుత్వం ఆరు నెలల్లో అధికారాన్ని కోల్పోతుండగా ఇప్పుడు హడావుడిగా పాత సర్టిఫికెట్ పనికి రావని సచివాలయంలో జగనన్న ఫోటోతో ఉన్న సర్టిఫికెట్లు తీసుకోవాలని వైసిపి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టడం. పిచ్చి తుగ్లక్ చర్య అనే ఈ పద్ధతి వెంటనే ఆపాలని మండల ప్రధాన కార్యదర్శి ఉయిక రత్తయ్య, మండల కన్వీనర్ కడుపు రమణా, ఓబీసీ మోర్చా ముత్యాల రాంబాబు కిషన్ మోర్చా మండల అధ్యక్షులు సన్యాసి మల్లయ్య, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు సొంది నాగేశ్వరావు, మడకం జానయ్య ఒక పత్రిక ప్రకటన డిమాండ్ చేశారు.

గత ఎన్నికల పంచాయతీ మండలాలు అభ్యర్థులకు పోటీకి పనికిరావు అని చెప్పిన జగనన్న ఉన్న ఫోటోతో రేపు ఎలా పనికి వస్తాయని ప్రశ్నించారు. పాత రెవెన్యూ సర్టిఫికెట్ ఉండగా ఎన్నికల ఓట్లు కోసం జగనన్న ఫోటో సర్టిఫికెట్లు కోసం ప్రజలపై బలవంతంగా రుద్దవద్దని బిజెపి నాయకులు తెలిపారు. ఆరు నెలల్లో దిగిపోతుండగా కొత్త డ్రామా ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వెంటనే పాత రెవెన్యూ సర్టిఫికెట్ యధావిధిగా కొనసాగించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.