వై.యస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా ప్రతినిధులే గడప గడపకి
65వ సచివాలయంలో గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో - ముత్తంశెట్టి. శ్రీనివాసరావు
మధురవాడ వి న్యూస్ జులై 24
గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం 7వ వార్డ్ పరిధిలోని 65వ సచివాలయంలో వాంబే కాలనీ సచివాలయం పరిధిలో మాజీ మంత్రి ,మాజీ విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తంశెట్టి. శ్రీనివాసరావు మరియు 7వ వార్డ్ వైసీపీ అధ్యక్షులు పోతిన. శ్రీనివాసరావు కలిసి వర్షం సైతం లెక్కచేయకుండా సోమవారం పర్యటించారు.ఈ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వము ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని,ప్రజలే ప్రజా ప్రతినిధులు దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పుకునే వారని కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా ప్రతినిధులే గడప గడపకి వెళ్లి ప్రజలును కలుసుకొని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని అన్నారు.