ఆకస్మికంగా మరణించిన సహచర కానిస్టేబుల్ కుటుంబానికి తోటి 2011 వి ఎస్ పి సివిల్ బ్యాచ్ కానిస్టేబుళ్ల చేయూత.

 ఆకస్మికంగా మరణించిన సహచర కానిస్టేబుల్ కుటుంబానికి తోటి 2011  వి ఎస్ పి సివిల్ బ్యాచ్ కానిస్టేబుళ్ల చేయూత.

కేశవరావు  కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా,అండగా ఉంటుంది: సి యం  త్రివిక్రమ్ వర్మ, ఐ పి ఎస్

విశాఖ వి న్యూస్ జులై 19

 విశాఖపట్నం సిటీ  జి ఆర్ పి లో డిప్యూటేషన్ మీద పనిచేస్తు 20-06-2023 న నైట్ డ్యూటీ లో వుండగా ఒక్క సారిగా ఆకాస్మికంగా  పడిపోవటం జరిగింది.  తేది 26.06.2023 22:32hrs. కి మరణించడం జరిగింది.విశాఖపట్నం సిటీ 2011 బ్యాచ్ 206 మంది కానిస్టేబుళ్లు ఒక్క రోజు శాలరీ సేకరించి, రూ.4,40,000/- ను చనిపోయిన ఎ. కేశవరావు  కుటుంబానికి ఆర్ధిక సహాయముగా, విశాఖపట్నం  పోలీస్ కమీషనర్ సి యం  త్రివిక్రమ్ వర్మ, ఐ పి ఎస్, చేతుల మీదుగా ఏ. కేశవరావు భార్య అయిన  ఎ. రమణమ్మ కి అందజేశారు. 



అదే విధంగా కానిస్టేబుల్ ఎ. కేశవరావు  కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా,అండగా ఉంటుందని,వారికి శాఖపరంగా రావలసిన అన్ని బెనిఫిట్లను అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. తమ సహోద్యోగి యొక్క కుటుంబానికి సహాయం అందించాలనే 2011 బ్యాచ్ వారి సంకల్పం, వారి సేవా దృక్పథం, ఐక్యతను, ఉదారతను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారని, 2011 బ్యాచ్ ను అభినందించారు.