నిత్య పెళ్లి కూతురు ... మహా కిలాడీ..! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13మంది..తో...అసలు స్టోరీ ఏంటి అంటే...
వి న్యూస్ :జూలై 10
నిత్య పెళ్లి కొడుకు ...ని చూసాం..వార్తల్లో విన్నాం..ఎక్కువ పెళ్లిళ్లుచేసుకొని ఉడాయించిన వారి కధనాలు ఎన్నో ... ఆడ పిల్లల జీవితాలు నాశనం చేసిన వారిని చూసాం....కానీ ఇక్కడ కొత్త ట్విస్ట్ ...
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి నిత్య పెళ్లి కూతురి అవతారమెత్తింది ఓ యువతీ. అవసరాల కోసం యువకులతో ప్రేమాయణం.. ఏకంగా పెళ్లి చేసుకుని అందినంత దండుకుంటుంది. పనైపోయిందని తెలిసి.. మరొకరిని చూసుకుంటుంది. ఆమెకు ఇది నిత్య కృత్యంగా మారిందిసదరు యువతీ వేధింపులను భరించలేక నాలుగోవ భర్త పోలీసులను ఆశ్రయించడంతో నిత్య పెళ్లి కూతురి భాగోతం వెలుగులోకి వచ్చింది.
పెద్దపల్లి జిల్లా NTPC ప్రాంతానికి చెందిన సుద్దాల రేవంత్‌కు వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన ఓ యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని యువతి తనకు అనుకూలంగా మలుచుకుని, 2022 డిసెంబర్లో వివాహం చేసుకుంది. మూడు నెలలు అనుమానం రాకుండా వ్యవహరించిన యువతి.. గత మార్చి నెల నుండి రేవంత్‌కు దూరంగా ఉంటుంది. భార్యను వెంట తెచ్చుకునేందుకు ప్రయత్నించిన రేవంత్ పై యువతీ.. తన అనుచరులతో దాడి కూడా చేయించింది. ఆ తర్వాత తనకు 20 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాలని లేదంటే రేవంత్ పర్సనల్ వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది.
ఆమె గురుంచి విచారించగా అసలు సిసలైన భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి చేసేదేం లేక పోలీసు వారిని ఆశ్రయించాడు