భీమిలి సముద్ర ప్రాంతంలో రాత్రి 11తరువాత ఆకతాయిలకు నిషేధం.

భీమిలి సముద్ర ప్రాంతంలో రాత్రి 11తరువాత ఆకతాయిలకు నిషేధం.

భీమిలి:వి న్యూస్ : జులై 22:

భీమిలి సిఐ.డి. రమేష్ ఆధ్వర్యంలో రాత్రి 11 సమయం దాటిన తర్వాత ఎవరైనా  వ్యక్తులు ఎటువంటి కారణం లేకుండా, ఆకతాయకంగా తిరగడం గాని మద్యం సేవించి వాహనములు నడుపుట గాని, పుట్టినరోజు ఫంక్షన్ అని సముద్రం ప్రాంతంలో కేకులు కట్ చేయడం గానీ, ఫోటో షూట్స్ గాని చేసిన యెడల చట్ట విరుద్ధంగా తీసుకొని, అటువంటి వ్యక్తులపై చట్టపరమైన కేసులు పెడతామని అందులో భాగంగా శుక్రవారం రాత్రి కొంతమంది వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. మరియు వారిని హెచ్చరించి విడిచిపెట్టారు. ఇకపై ఇటువంటి చర్యలు ఎవరైనా చేపడితే వారిపై చట్టపరమైన కేసులు పెడతామని ఉపేక్షించేది లేదని సిఐ హెచ్చరించారు.