100మంది అడ్డొచ్చారు అయినాసరే ముఖ్యమంత్రినే అరెస్ట్ చేసింది.

100మంది అడ్డొచ్చారు అయినాసరే ముఖ్యమంత్రినే అరెస్ట్ చేసింది. 

సివిల్ సర్వంట్స్ నిజాయితీగా తమ డ్యూటీ తాము చేస్తే దేశంలో రాజకీయ నాయకుల అరాచకం సగానికి పైగా తగ్గిపోతుందండి అని మాజీ సివిల్ సర్వంట్స్ చెబుతూ ఉంటారు. అంతే కాదు తమకు తాముగా బంధీలుగా మారి, సివిల్ సర్వంట్స్ నాయకుల ఒత్తిడికి తలోగ్గుతూ ఉంటారు. కర్ణాటకకు చెందిన సూపర్ కప్ రూపా దివాకర్ మోడెల్,ఆమెను లేడీస్ సూపర్ కప్ రూప అని పిలుస్తారు. కర్ణాటకలో ఆమె పేరు చెబితే రాజకీయ నాయకులకు హడల్, ఆమె వస్తుందంటే రెండు అడుగులు వెనక్కి వేసి మరి మాట్లాడుతారు. ఇక తన కింద పనిచేసే టీమ్కి అయితే ఆమె చెప్పిన పని తూచ తప్పకుండా చేయాల్సిందే. కర్ణాటకలో చదువుకున్న ఆమె రెండువేల బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ . ఆమె తండ్రి రిటైర్డ్ ఇంజనీర్ . ఆమెకు జాతీయ స్థాయిలో నలభై మూడవ ర్యాంక్ వచ్చింది. అంతే కాదు హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో ఫిఫ్త్ ర్యాంక్ ట్రైనింగ్ . ఇక రూప మొదటిసారిగా మధ్యప్రదేశ్ నాటి సీఎం ఉమా భారత్ ని అరెస్ట్ చేసినప్పుడు వార్తలకు ఎక్కారు.

హుబ్లి అల్లర్ల కేసు లో స్థానిక కోర్ట్ నాన్ బెయిల్ వారంటీ ఇష్యూ చేయడంతో ఆమెకు ఆ పని అప్ప చెప్పారు ఉన్నత అధికారులు. వి ఐ పి కేసు కావడంతో స్పీడ్ గా ఆమె నిజాయితీగా ధైర్యంగా తన పని పూర్తి చేశారు. కానీ కోర్ట్ ఆర్డర్ కారణంగా నా కెరీర్ లో అదే సులభమైన పని అంటారు రూపా. కానీ తర్వాత మాజీ ముఖ్యమంత్రి యువగల్ రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వడంతో, అతని అనుచరులు మూడు ప్రభుత్వ వాహనాలు తగలబెట్టారు. దీనితో ఎస్పీ గా ఉన్న రూప, అతని వీడియో చూసి చట్ట పరంగా చర్య తీసుకొని కేసు పెట్టి అరెస్ట్ చేయమని స్థానిక పోలీసులకు చెప్పింది. ఆ ప్రాంత డిఎస్పీ కి ప్రత్యేకంగా చెప్పి ఆదేశాలు జారీ చేసింది. డిఎస్పీ మసూది ఎస్పీ ఆదేశాలు అమలు చేయక పోగా వాదించారు. మాజీ మంత్రి పవర్ ఫుల్ లీడర్ ఆయన్ను అరెస్ట్ చేయకూడదని చెప్పడమే కాకుండా ప్రతి క్షణం అతనికి ఫోన్ చేసి వివరాలు చెప్పారు. కానీ రూప పోలీస్ స్టేషన్ కి వెళ్లి రాత్రి తొమ్మిది గంటల వరకు కూర్చొని అతన్ని స్టేషన్ కు రప్పించారు. మంత్రి మర్యాదగా రాకుంటే నేనే వెళ్తాను తరువాత పరిస్థితి మారిపోతుందని వార్నింగ్ ఇవ్వడంతో సదరు మాజీ మంత్రి యువగల్ లొంగిపోయారు.

రాత్రి మొత్తం స్టేషన్ లోనే గడిపి తెల్లవారుజామున కోర్ట్ లో ప్రవేశపెట్టారు. అంతేనా డ్యూటీ నిజాయితీగా చేయకుండా నిందితుడి సహాయం చేశారని డిఎస్పీ మీద చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. విచారణ తరువాత డిఎస్పీ తప్పు చేసాడని తేలడంతో అతను ఏడాది పాటు సస్పెండ్ కూడా అయ్యాడు. ఈ ఒక్కటే కాదు బెంగళూరు డీసీపీ గా పని చేస్తున్నప్పుడు కర్ణాటక మొత్తానికి షేక్ చేసి పడేసారు. ఆర్డర్ ఫోర్సస్ డిస్కప్లైన్ గా ఆమె నియమించిన తర్వాత కానీ తాము ఎంత పెద్ద తప్పు చేశామో వారికి అర్థం కాలేదు. తన ఫోర్స్ లో పేర్లు చాలా మంది ఉన్నా కూడా సగానికి పైగా వి ఐ పి లకు గన్ మన్ లుగా వెళ్లారు. అవసరం లేకుండా ఒక్కొక్క నేతకు స్టేటస్ కోసం ఐదారుగురు పోలీసులను గన్ మన్ గా పెట్టుకున్నారు. దీంతో ఆమె అనవసరంగా ఉన్న వారినందరినీ కూడా వెనక్కి పిలిపించేశారు. ఉన్నత అధికారులు వారించినా సరే యాక్సెస్ గన్ మెన్ లు వారికి ఎందుకు, జనం సొమ్ముతో వారికి సోకుల అంటూ, రెండు వందల పదహారు మంది గన్ మెన్ లను వెనక్కి పిలిపించారు.

అంతే నోరు తెరిచి కూడా ఏ నాయకుడు అడగలేదు. ఎందుకంటే అక్కడ ఉంది రూప. ఈ ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఒక అధికార పార్టీ ఎం ఎల్ ఏ అల్లర్లు చేయించడం తేలడంతో అతని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చినందుకు, ఏకంగా ప్రీవిలేజ్ కమిటీ ముందుకు పిలిచి బెదిరించే ప్రయత్నం చేశారు నేతలు. కానీ చట్టం చాలా క్లియర్ గా బ్యూరో క్రిట్స్ కి భద్రత కల్పిస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు అంటారు ఆమె. నిజాయితీగా ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఏమి చేయలేరు అంటారు. చివరకు కర్ణాటక లో కొత్తగా ఏర్పడిన యాదిరి జిల్లాకు ఎస్పీ గా ట్రాన్స్ఫర్ చేశారు అధికారులు. అక్కడ కనీసం ఎస్పీ ఆఫీస్ కూడా సరిగ్గా లేదు. పైగా తనకు కోటర్స్ కూడా లేకపోవడంతో తన భర్తకు ఇచ్చిన కోటర్స్ లో ఉన్నారు. అది కూడా ఒక పల్లెటూరులో తన కూతురు చదువు కూడా తన ఇంటికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్కూల్ లోనే మూడేళ్ళు చదివించారు. ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే తన కూతురు పలక పట్టుకొని కింద కూర్చొని అందరితో పాటు చదువుకుంది. స్కూల్ లో కనీస వసతులు కూడా లేవు.

అయినా సరే అందరి పిల్లలు తన కూతురు లాంటి వారే అంతా సమానమే అని తన కూతురు ప్రైమరీ ఎడ్యుకేషన్ పల్లెటూరు లోని ప్రైమరీ స్కూల్ లో చదివించారు. ఇక మధ్య కాలంలో జైలుల శాఖ డీజి గా ఆమె వెళ్ళగానే, శశికళ కు ఉన్న వి వి ఐపీ ట్రీట్మెంట్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఆధారాలు సేకరించి శశికళ నుంచి రెండు కోట్లు తీసుకొని జైలు అధికారులు ఆమెకు వి ఐ పి ట్రీట్మెంట్ ఇస్తున్నారని మీడియా కి లీక్ చేయడంతో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు షేక్ అయిపోయాయి. అదంతా తప్పని ఆమె మీదనే అభాండాలు వేసారు కూడా. చివరకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వినాయకరామ్ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ జరపగా రూపా చెప్పినవన్నీ నిజమని తేలింది. దీనితో మళ్ళీ ప్రక్షాళన మొదలు పెట్టారు. ఎక్కడ నిజాయితీగా పని చేసినా సరే ఆమెకు ట్రాన్స్ఫర్ అనేది కామన్ . ఇరవై ఏళ్లలో ఆమెకు దాదాపుగా నలభై రెండు ట్రాన్స్ఫర్ లు జరిగాయంటే నిజాయితీగా ఉంటె ఎంత కష్టం అర్థం చేసుకోవచ్చు. అయినా సరే తనకు అప్పజెప్పిన బాధ్యతను ఖచ్చితంగా నిజాయితీగా, నిక్కచ్చిగా చేస్తారు రూప.

బ్యూరో క్రేట్స్ తమకుతాము విధించుకున్న చైన్స్ వదిలించుకుంటే కొత్త భారతాన్ని చూస్తాం అంటారు రూప. మరి మన ఐఏఎస్ ఐపీఎస్ లు పని చేయగలుగుతారా? లేదా అనేది మాత్రం చూడాలి. అందరూ రూపాలు అయితే మాత్రం అవినీతి కంపు నాయకుల దరిద్రం కాస్తైనా వదులుతుంది మరి. ఇండియా రూపురేఖల మారుద్దాం అనుకుంది రూప. కానీ ఇరవై ఏళ్లలో దాదాపుగా నలబై రెండు ట్రాన్స్ఫర్ లు. అయినా సరే ఎక్కడ తగ్గేది లేదు. తనకు వీలు ఉన్నంత వరకు కూడా అందరి రూపు మార్చుకుంటూ నే వచ్చింది. కానీ ఫలితంగా ఆమెకు మిగిలింది ట్రాన్స్ఫర్ మాత్రమే. మరి ఇలాంటి ఆఫీసర్ లకు తప్పకుండా మనం సెల్యూట్ చేయాల్సిందే మరి.