పడకేసిన పారిశుద్యం స్పందించని అధికార యంత్రాంగం

పడకేసిన పారిశుద్యం స్పందించని అధికార యంత్రాంగం 

అల్లూరి జిల్లా,హుకుంపేట: వి న్యూస్: జూన్ 30 :-

గ్రామం లో దుర్గంధం స్పందించని వైనం

కనిపించని స్వచ్ఛ సంకల్పం

ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం

ఒక పక్క ప్రభుత్వం గ్రామలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే అధికారుల నిర్లక్ష్యమో పాలకుల వైఫల్యామో కానీ  కంచరం కంపు కొడుతుంతుంది. కానీ తప్పనిపరిస్తిలో ఉండాల్సిందే అని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో మారుమూల మండలం అనుకుంటే పొరపాటే, అల్లూరి జిల్లా కు కూతవేటు దూరంలో ఉన్న హుకుం పేట మండల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.మండల కేంద్రంలోని ఏ వీధిలో చూసినా చాలుదుర్గంధంగ వెదజల్లుతుంది.అపారిశుద్యంతో పంచాయితివాసులు అవస్థలు పడుతున్నారు. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి.తప్పని దోమలు బెడద చెరువులను తలపించే రీతిలో మురికి కాలువలు తాండవం అడుతున్నాయి. నెలల తరబడి పారిశుధ్య పనులు చేపట్టకపోవడం తో డ్రైనేజిల్లో పూడికలు, విధుల్లో ఎక్కడకిక్కడే చెత్త పేరుకుపోయి చెత్తకుప్పలు దర్శనమిస్తు దుర్గంధం వెదజల్లడంతోపాటు దోమలు,ఈగలు విజృంభిస్తున్నాయి . దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడి పలు రకాలైన వ్యాధులకు గురై ఆస్పత్రి పాలవుతున్నారు. గ్రామంలో ఇంత జరుగుతున్న  ప్రజాప్రతినిధులు గాని ,అధికారులు గాని పట్టించుకొకపోవడం విచారకరం. అపారిశుద్యం విషయంపై ఎన్ని సార్లు అధికారులకు, పంచాయతీ సిబ్బందికి చెప్పిన,పట్టించుకోవడం లేదని మండల వాసులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుధ్యం పనులు చేపట్టిలనిమండల వాసులు కోరుతున్నారు.