తీవ్ర వడగాల్పులకు విద్యుత్ కోతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు.
మధురవాడ : వి న్యూస్ : జూన్ 12:
మండుతున్న ఎండలు వడ గాల్పులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధురవాడ జోన్3 పరిసర ప్రాంతం ఆర్ టి సి కాలనీ, వాంబేకాలనీ, మల్లయ్యపాలెం, నగరంపాలెం తదితర ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందని సూచించిన సమయం కాకుండా కనీసం ఎటువంటి గాలులు లేని సమయం లేకుండానే ప్రతీ రోజు గంటల తరబడి విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో మధురవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వడగాల్పుల సమయంలో విద్యుత్ అంతరాయానికి వృద్ధులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపునుండి రకరకాల చార్జీలతో విద్యుత్ వినియోగదారులకు భారీగా భారం వేస్తున్నారని విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కోరుతున్నారు.