చంద్రంపాలెం జడ్.పి.హెచ్ పాఠశాలలో తల్లిదండ్రులు కమిటీ సభ్యుల ఆవేదన
మధురవాడ : వి న్యూస్ : జూన్ 14:
జీవీఎంసీ జోన్ టు పరిధిలోని చంద్రంపాలెం జడ్.పి.హెచ్ పాఠశాల ఆంధ్రప్రదేశ్ లొనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాల గా గుర్తింపు పొందిన ఏకైక పాఠశాల. ఈ పాఠశాలలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యార్థుల తల్లిదండ్రులు నూతన కమిటీని నియమించారు. నూతన కమిటీ ఏర్పాటు అయ్యిన అప్పటినుండి తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు పాఠశాల తరుపునుండి ఎటువంటి గుర్తింపు లేదు అని పలువురు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలలో ఏ కార్యక్రమాలు చేయాలన్న ముందుగా కమిటీ సభ్యులు అందరికీ తెలియపరిచి అందరి ఆమోదం తో కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ తల్లిదండ్రులు కమిటీ సభ్యులకు తెలియపరచకుండా ప్రధాన ఉపాద్యాయులు ఏక పక్ష నిర్ణయాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పాఠశాల కమిటీ సభ్యులు తెలుపుతున్నారు. కార్యక్రమం నిర్వహణ సమయంలో కూడా కమిటీ సభ్యులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జగనన్న విద్య కానుక కిట్లు నాల్గవ విడత పంపిణీ కార్యక్రమం విషయం తల్లిదండ్రులు కమిటీకి ముందుగా చెప్పకుండా ఐదు నిమిషాలకు ముందు సమాచారం సోషల్ మీడియా ద్వారా తెలిపారని ఐదు నిమిషాలకి ముందుగా సమాచారం తెలిపితే ఎలా వస్తామని అయినా కార్యక్రమం అవుతుందని ముందు రోజే ప్రధాన ఉపాధ్యాయులకి సమాచారం తెలుస్తుంది కదా ముందుగా చెప్పకుండా ఐదు నిమిషాల ముందు చెప్పడం ఏంటని కమిటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు ? పాఠశాల కమిటీ సభ్యులు లేకుండా కార్యక్రమం నిర్వహించడం ఏంటని మండి పడుతున్నారు. అలాంటప్పుడు ఈ కమిటీలు పెట్టడం ఎందుకు గౌరవo లేనప్పుడు మాకు ఎందుకు ఈ పదవులు అని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వంలో పాఠశాల కమిటీ చాలా చక్కగా నిర్వహించారని మరి ఈ ప్రభుత్వం వచ్చేసరికి ప్రధానోపాధ్యాయులు ఎందుకు పాఠశాల కమిటీ వారికి గౌరవం ఇవ్వడం లేదని పలువురు కమిటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు?