సలంబ శిరసకోనాసన లో పెదిరెడ్ల కనకారావు రికార్డ్
మధురవాడ : వి న్యూస్ : జూన్ 10 :
మధురవాడ : సలంబ శిరసా కోణాసనంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వన్నె తెచ్చిన ఘనత ఆయన సొంతం. గత 20 ఏళ్లుగా మార్షల్ ఆర్ట్స్ తో పాటు యోగాలో తన ప్రతిభను కనబరిస్తూ అరుదైన అవార్డులు,రికార్డులు కొల్లగొడుతూ తన సత్తా చాటుతూ మార్షల్ ఆర్ట్స్ రంగంలోనే పలువురికి ఆదర్శంగా నిలిచారు.
పెదిరెడ్ల కనకారావు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి మహావిశాఖ 6వ వార్డు పరిధి ఆర్.హెచ్ కాలనీలో నివాసం ఉంటూ డ్రాగన్ ఫిట్నెస్ సెంటర్లో ప్రధాన శిక్షకుడిగా పనిచేస్తూన్న కనకారావు పలు రికార్డులను సొంతం చేసుకున్నారు, అదేవిధంగా గత నెల మార్చ్ 2023 లో యోగా ఫీట్ ప్రదర్శనలో సుమారు 4 నిమిషాల 25 సెకండ్ల పాటు చేసిన సలంబ శిరసకోనాసన వీడియో క్లిప్పులను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పంపించగా, వారు వాటి వివరములు తెలుసుకుని ఇండియాలో ఆ యోగ ఫీట్స్ లో ఆ విధమైన భంగిమలో 4 నిమిషాల 25 సెకన్ల పాటు ఇప్పటివరకు ఎవ్వరూ చెయ్యలేదని నిర్ధారించి గత నెలలో ఏప్రిల్ 22 న ధ్రువీకరించగా శనివారం కొరియర్ ద్వారా బంగారు పతకాన్ని, ధ్రువీకరణ పత్రంతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకాన్ని పంపించినట్లు ప్రకటన ద్వారా తెలిపారు. అరుదైన ఈ పతకం సాధించిన పెదిరెడ్ల కనకారావును కుటుంబ సభ్యులు, స్థానికులు, విద్యార్థులు అభినందించారు. రానున్న రోజుల్లో భారత తరఫున గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.