వాహన దారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణాలు చేయాలి.

రేపటి నుండి చంద్రంపాలెం గ్రామ దేవత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు మహోత్సవం సందర్భంగా వాహన దారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణాలు చేయాలి.

వి న్యూస్ మధురవాడ 

విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం గ్రామ దేవత చంద్రంపాలెం జాతర గట్టు పై కొలువైయున్న శ్రీ దుర్గాలమ్మ ఉత్సవాలు గతనెల రోజుల నుండి జరుగుచున్నది, ముఖ్యంగా తేది 12/6/2023 సోమవారం  తొలేళ్లు ఉత్సవం, తేది 13/6/2023 మంగళవారం ప్రధాన పండుగ జరుగుతుందని తెలిపారు, పండగ రోజు ఉదయం చద్దన్నం దండడం, ఉదయం  జోగి దండడం,  నూకాలమ్మ పసుపు కుంకుమ సమర్పించడం, అనంతరం ఉయ్యాల కంబాల ఎత్తడం మధ్యాహ్నం 2:00గంటకు పాలధార తిరగడం , అనంతరం అమ్మవారి గటాలు గ్రామంలో తిరగడం , అనంతరం అమ్మవారి సంబరం ప్రారంభం కానుంది ముందుగా అమ్మవారిని ఉయ్యాలలో పెట్టి ఊపడం అక్కడ నుండి సంబరం మేళ తాళాలు మంగళ వాయిద్యాలు, వివిధ నేల డాన్సులు పలుసాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలో అన్ని వీధులు తిరుగుతూ అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించడం తో అనుపు కార్యక్రమం పూర్తి అవుతుందని తెలిపారు,.

ఈ పండుగ సందర్భంగా మధురవాడ పరసర ప్రాంతాల ప్రజలు, బహుళ అంతస్తుల భవనంలో నివసించువారు వాహన చోదకులు అందరూ 13, 14 తేదీలలో  మిదిలాపురి ఉడా రోడ్డు జంక్షన్ నుండి కొమ్మాది జంక్షన్ వరకు జాతీయ రహదారుల ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్డులో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణాలు సాగించాలని కోరారు, పండగకు వచ్చే అతిథులు, బంధు మిత్రులు కొమ్మాది వైపునుండి వచ్చే 4చక్రాలు ,టూ వీలర్స్ కోపరేటివ్ బ్యాంకు (విశాఖ హాస్పిటల్ ( జంక్షన్ నుండి వాంబే కోలని కి రోడ్డులో పార్కింగ్ ఏర్పాటు చేసిన స్థలంలో పార్కింగ్ చేసుకోవాలని, మరియు విశాఖపట్నం వైపు నుండి పండుగకి వచ్చే అతిథులు బంధు మిత్రులు తమ వాహనాలు  దుర్గానగర్2 జంక్షన్ నుండి వెళ్లి NGO లేఅవుట్ రోడ్డు ఇరువైపులా ఆ కాలని వాసులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ చేసుకోవాలని కోరడమైనది, ఈ విషయం చంద్రంపాలెం గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు