జగన్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: విజయ్ బాబు

 జగన్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: విజయ్ బాబు  

వి న్యూస్ విశాఖ ఉత్తర

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు   నారా చంద్రబాబు నాయుడు  మరియు మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ  శాసనసభ్యులు  గంటా శ్రీనివాసరావు  ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి చిక్కాల విజయబాబు  ఆదివారం విశాఖ ఉత్తర నియోజవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి  విజయ్ బాబు  మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టిడిపి హయాంలో ఏపీకి లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు  మారిస్తే, జగన్ ప్రభుత్వం 2022 నుంచి విద్యుత్ లోటుతో కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 



కరెంటు కోతలతో రైతులు ప్రజలే కాక కార్మికులు ఇతర ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమవ్వడమే కాక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అయితే కనీసం మూడు నుంచి నాలుగు గంటలు కరెంటు కూడా అందించలేని పరిస్థితి. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు 38 లక్షల కొత్త విద్యుత్ కనెక్షన్ ఇస్తే వైసీపీ మాత్రం కేవలం 8 లక్షల కలెక్షన్లతో సరిపెట్టింది. 73 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో 20 మంది ముఖ్యమంత్రులు 22 వేల మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి చేస్తే ఒక్క చంద్రబాబునాయుడు  హయాంలో 15 వేల మెగావాట్లు విద్యుత్తును ఉత్పత్తి చేశారు. 


అంతేకాక ఈ ప్రభుత్వ హయాంలో కరెంటు ధరలు  అమాంతం అత్యధికంగా పెరిగాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా పెంచింది లేదు. అలాంటిది ఈ సైకో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడు సార్లు పెంచారు. అంతేకాక మోటార్లకు మీటర్లు అని చెప్పి రైతులు దగ్గర నుంచి అదనపు వసూలు చేసి మరింత ఇబ్బందులకు గురి చేశారు. మరియు డిస్కమ్ లు తో సగటు విద్యుత్ ధర యూనిట్ కి రూ.4 75 పైసలు ఉండగా, జగన్ ప్రభుత్వం మాత్రం బహిరంగ మార్కెట్లో రూ. 8  77 పైసలు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేసింది దీంతో 2019 - 2022 ఏడాదికి గాను దాదాపు 6000 కోట్లు భారం ప్రజలపై పడిందన్నారు. మరియు ఈ జగన్ ప్రభుత్వం అనేక నిధుల దుర్వినియోగానికి పాల్పడింది. ఉదాహరణకి హిందూజ గ్రూపు, శిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, జఇఐఎస్  ఒప్పందం లాంటి పలు విషయాలలో నిధులు దుర్వినియోగం చేశారు. కావున ప్రజలు ఆలోచించి రాష్ట్రం బాగుపడటానికి మరిన్ని పరిశ్రమలు రావడానికి జనాభా నుండి పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి మరియు ఆర్థిక నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి 10 సంవత్సరాల ప్రణాళికతో పనిచేసే ప్రభుత్వం అవసరం. ప్రణాళికతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు నాయుడు  మాత్రమే ముఖ్యమంత్రి అయి తీరాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం మాజీ ఛైర్మన్ రాజమండ్రి నారాయణ , రాష్ట్ర పార్టీ తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత  పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొయిలాడ వెంకటేష్, చీపురుపల్లి స్వరూప్, ఎస్ రామణ, జాగారపు కోటి, బాబు,  నాగరాజు,  కె బంగారు బాబు, సాగర్ సాయి మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.