దురుసుతనం,అసభ్యకర పదజాలంతో ప్రవర్తిస్తున్న సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రటరీ

దురుసుతనం,అసభ్యకర పదజాలంతో ప్రవర్తిస్తున్న సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రటరీ

మాధవధార జూన్ 29(వి న్యూస్):

ప్రజలకు సేవలందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలో కొంత మంది సచివాలయం ఉద్యోగుల పనితీరు,దురుసుతనంతో,అసభ్యకర పదజాలంతో  వ్యవహరిస్తున్న తీరు పట్ల పలువురు ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఎంతో సౌమ్యంగా ప్రజలకు కావాల్సిన సేవలు అందించాల్సిన ఉద్యోగులు ఇలా ఇస్తానుసరంగా ప్రవర్తించడం పట్ల పలు సచివాలయలలో లబ్ధిదారులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే స్థానిక 50వ వార్డు 294 సచివాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్న సదరు శివ అనే ఉద్యోగి దురుసుతనంగా,అసభ్యకర పదజాలంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.సచివాలయంనకు వచ్చిన,చరవాణిలో సంప్రదించిన పలువురు పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ,దురుసు పదజాలంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.అంతేకాదు 294 సచివాలయం పరిధిలో గల ఎన్నో కట్టడాలను సక్రమ కట్టడాలుగా మార్చారు అని కూడ వార్తలు వినిపిస్తున్నాయి.ప్రైవేట్ లైసెన్స్డ్ ప్లానర్ ద్వారా లబ్ధిదారుల నుంచి కట్టాడాలకు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో ఇప్పటికే సదరు ఉద్యోగి పై పలు మార్లు ఉన్నత అధికారికి సైతం పలువురు వివరించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో పైస్థాయి అధికారి ఆవేశపూరితంగా వ్యవహరిస్తున్న ఈ టౌన్ ప్లానింగ్ సెక్రటరీని పిలిపించుకుని క్లాస్‌ తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది.అయినప్పటికి సదరు ఉద్యోగి సచివాలయంలో లబ్ధిదారులకు అందుబాటులో ఉండకపోవడమే కాకుండా చరవాణి ద్వారా సంప్రదించిన వ్యక్తులతో గిరి ప్రదక్షిణ మూలంగా ఫీల్డ్ డ్యూటీ వేసారంట్టూ,జీవీఎంసీ కమీషనర్ ఆదేశాలు మేరకు మేము ఫీల్డ్ డ్యూటీలో ఉన్నాము అంటూ దురుసుగా, అసభ్యకర పదజాలంతో ప్రజలు ఇబ్బంది పడే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు.అయితే సదరు టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఇటువంటి తీరును చాలా చోట్ల వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా పై స్థాయి అధికారులు లబ్ధిదారులతో వ్యవహరించే తీరును సదరు ఉద్యోగికి నేర్పాలని,పైస్థాయి అధికారి మందలింపుతోనైనా లబ్ధిదారులతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారో లేదా.. నేనే రాజు నేను మంత్రిలా వ్యవహరిస్తారో వేచిచూడాల్సిందే.