సాంకేతిక ఇంజినీరింగ్ కళాశాలలో ఇంటర్నేషనల్ యోగ డే సంబరాలు
మధురవాడ: వి న్యూస్ : జూన్ 21
స్థానిక మధురవాడ సమీపంలో గల సాంకేతిక విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కళాశాల నందు 9వ ప్రపంచ యోగ దినోత్సవం 2023 సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు.ఎన్ ఎస్ ఎస్ యూనిట్ అద్వర్యంలో ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా సాంకేతిక కళాశాల యందు యోగ కార్యక్రమాన్ని సెమినార్ హాల్ లో నిర్వహించారు,ఈ యోగ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మిస్టర్ బి.అశోక్ నాయుడు యోగ కాన్సియస్నెస్ ట్రస్ట్ అధినేత ఈ కార్యక్రమానికి విచ్చేసి యోగ డే యొక్క గొప్పతనాన్ని తెలియచేసారు,మా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో యోగాసనాలు చేయించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసి నందుకు ముఖ్య అతిధిని ప్రధాన ఉపాధ్యాయులైన డాక్టర్ ఎన్ సి అనిల్ , ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధు భట్ మేడం మరియు ఎన్ ఎస్ ఎస్ కోర్డినేటర్ సి హెచ్ వేణు ఘనంగా సత్కరించారు .