ఘనంగా చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి మారువారం ఉత్సవాలు

ఘనంగా చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి మారువారం ఉత్సవాలు 

మధురవాడ: వి న్యూస్: జూన్ 21:


చంద్రంపాలెం గ్రామ దేవత చంద్రంపాలెం జాతర గట్టు పై కొలువైయున్న శ్రీ దుర్గాలమ్మ గ్రామ దేవత ఉత్సవాలు గత నెల 5వ తారీఖున ప్రారంభము ఈ నెల 13వ ముగిశాయి, అమ్మవారి ఉత్సవాలు జరిగి వారం రోజులు గడచిన సందర్భంగా మారువారం ఉత్సవాలు ఘనంగా జరిపించడం జరిగింది, ముందుగా పండగ రోజున నెల కొల్పిన ఉయ్యాల కంబాల తీయడం అనంతరం అమ్మవారి ఇంటి నుండి బయలుదేరి సంబరం మేళ తాళాలు మంగళ వాయిద్యాలు, వివిధ నేల డాన్సులు పలుసాంస్కృతిక కార్యక్రమాలతో మందుగుండు సామగ్రి ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలో అన్ని వీధులు తిరుగుతూ ముందుగా శ్రీ బంగారమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అనంతరం మరల మరల అమ్మవారి ఇంటి నుండి బయలుదేరి గ్రామంలో అన్ని వీధులు తిరుగుతూ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మారువారం ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అమ్మవారి చదును పట్టు (రచ్చబండ) వద్ద బాలనాగమ్మ అను బుర్రకథ కడు రమణీయంగా ప్రదర్శించారు,శ్రీ లక్ష్మీ నరసింహ కోలాటం బృందం సభ్యులు చేసిన కోలాటం నృత్యం భక్తులను ఆకట్టుకుందని ఈ కోలాటం బృందం నెల పండుగ మొత్తం సభ్యులు కోలాటం నృత్యం చేసినందుకు గాను ఈ పండుగలో చిన్నారులు కర్రసాము,గరిడి నిర్వహించిన సభ్యులను దుషాలువ తో సత్కరించారు. నెల పండుగలో కోలాటం, కర్రసాము, గరిడి ప్రదర్శించిన బృందాల సభ్యులను శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు,చంద్రంపాలెం గ్రామ పెద్దలు గ్రామం సభ్యులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో చంద్రంపాలెం గ్రామ పెద్దలు, శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, చంద్రంపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు.