యూజర్ చార్జీలు వసూల్లపై తీవ్ర ఒత్తిడి లో సచివాలయం సిబ్బంది

యూజర్ చార్జీలు వసూల్లపై తీవ్ర ఒత్తిడి లో సచివాలయం సిబ్బంది 

ఆంధ్రప్రదేశ్: వి న్యూస్ : జూన్ 15: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన సచివాలయం సిబ్బంది ప్రస్తుతం తీవ్ర వొత్తిడిలో బయటకి కక్కలేక మింగలేక ఉన్నారని వాపోతున్నారు వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుని ప్రస్తుతం సచివాలయం ఉద్యోగులతో యూజర్ చార్జీలు వసూలకు సిబ్బంది పై టార్గెట్స్ ఇచ్చి అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తుందటంతో ఆందోళన చెందుతున్నారని కొందరు అంతర్గతంగా బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చెత్తపై పన్ను ఏంటి ఇంటి పన్ను, నీటి పన్ను కడుతున్నముగా చెత్త పన్ను కట్టము అని సచివాలయం సిబ్బంది పై శాపనార్ధాలు పెడుతున్నారని అంటున్నారు. ప్రజలు చెత్త పన్ను కట్టకపోవటంతో వికలాంగుల, వృధాప్య, వితంతు పెన్షన్ ఇచ్చినప్పుడు బలవంతం చెయ్యాల్సి వస్తుందని మిగిలిన వారికి సంక్షేమ పథకాలు దరఖాస్తు చేసే సమయంలో వసూలు చెయ్యాల్సి వస్తుందని వాపోతున్నారు. అధికారులు సచివాలయం సిబ్బంది ఇబ్బందులను గుర్తించి ఒత్తిడి చేయవద్దని కోరుతున్నారు.