గిద్దలూరు లో జాతీయ జెండాకు అవమానం.
గిద్దలూరు : వి న్యూస్ : జూన్ 14 :
గిద్దలూరు పట్టణం అర్బన్ కాలనీలోని 13, 14 వార్డుల సచివాలయం కార్యాలయం పైన ఎగురవేసిన మువ్వన్నెల జాతీయ జెండాకు అవమానం జరిగింది. కార్యాలయంపై ఒక చిన్నపాటి కర్రకు కట్టి ఎగరవేసిన జాతీయ జెండా పీకిపోయి పూర్తిగా చిరిగిపోయింది. కానీ ఆ సచివాలయ పరిధిలోని అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు అని సచివాలయం సిబ్బంది జాతీయ జెండాని గౌరవించి ప్రజలకు తెలిపే విధంగా ఉండాల్సిన సిబ్బందే ఇంత నిర్లక్ష్యం గా వ్యవహరించటం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10.15 గంటలకు అధికారి నాయక్, హెల్త్ అసిస్టెంట్ మాత్రమే కార్యాలయంలో అందుబాటులో ఉన్నారు. మిగిలినవారికి సమయం పట్టినట్లు లేదు అని సచివాలయం పరిధిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం గా వ్యవహరించిన సిబ్బంది పై తగు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.