రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గింంచాలని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కి మధురవాడ వైస్సార్సీపీ సీనియర్ నాయకులు వాండ్రాసి రవికుమార్ వినతి

రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గింంచాలని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కి మధురవాడ వైస్సార్సీపీ సీనియర్ నాయకులు వాండ్రాసి రవికుమార్ వినతి 

మధురవాడ : వి న్యూస్ : జూన్ 12: 


    రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే భాగంలో మధురవాడలో కూడా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచారు. ఈ ప్రాంతంలో చార్జీల పెంపు ఎటువంటి హేతుబద్ధత లేకుండా జరిగినట్లు తెలుస్తోంది.వాండ్రాసి రవికుమార్ అన్నారు అందుకు ఉదాహరణగా అయోధ్య నగర్ లే అవుట్ నందు 22 వేల నుంచి 25 వేలకు పెంచారు పక్కనే ఉన్న నగరం పాలెం గ్రామకంఠం మరియు ఆ చుట్టుపక్కల ఉన్న పదిహేను ఇరవై అడుగుల ప్రైవేటు లే అవుట్లుకు 22 వేల నుంచి 30 వేలకు పెంచారు నగరం పాలెం మరియు మల్లయ్య పాలెం గ్రామకంఠాలలో చాలా వరకు తల్లితండ్రులు పిల్లలకు గిఫ్ట్ డీడ్లు చేసే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే గ్రామస్తులందరూ కూలీనాలీ చేసుకునే పేదవారు. అయోధ్య నగర్ లే అవుట్ మరియు దాదాపు వందల ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి అలాగే ఇవన్నీ ఉడా ఎప్రూవల్ లే అవుట్లు. కొనుగోలు అమ్మకాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది పోర్ట్ కాలనీ ఏరియా కూడా నేషనల్ హైవే కు దగ్గరగా నగరం పాలెం మల్లయ్య పాలెం కంటే ముందు ఉన్న ప్రాంతం అక్కడ కూడా 25 వేలు ధరగా నిర్ధారించారని తెలుస్తోంది. అలాంటి చోట్ల కేవలం మూడు వేలు పెంచి గ్రామకంఠం మరియు దాని చుట్టూ ఉన్న పది పదిహేను ఇరవై అడుగుల స్థలాలకు ఏడు వేల రూపాయలు పెంపు ఏ ప్రాతిపదికన చేశారో అర్ధం కావడం లేదు అన్నారు.

దయచేసి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని సరైన విచారణ చేసి సామాన్య పేద ప్రజల నివాసం ఉండే నగరం పాలెం మరియు మల్లయ్య పాలెం గ్రామకంఠం మరియు వాటి చుట్టుపక్కల ఉన్న స్థలాలకు రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని తమరి ద్వారా ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం అని మధురవాడ వైస్సార్సీపీ సీనియర్ నాయకులు వాండ్రాసి రవి కుమార్ తెలిపారు.