బస్సు సౌకర్యం 70 ఏళ్ల శంభువాని పాలెం గ్రామస్తుల అభిలాష

బస్సు సౌకర్యం 70 ఏళ్ల శంభువాని పాలెం గ్రామస్తుల అభిలాష

గడప గడపలో అవంతికి విన్నవించుకున్న గ్రామస్తులు

భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చొరవతో

శంభువాని పాలెం కు బస్సు సర్వీసు ప్రారంభం

మధురవాడ:వి న్యూస్: జూన్  ప్రతినిధి: జూన్ 29

ఏకంగా 70 వత్సరాల కల అది. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావాలని, కావాలని అక్కడి ప్రజల కోరిక. అది ఇప్పుడు నెరవేరింది. గిరిజనులు తమ కల సాకారం అయినందుకు చాలా సంతోషంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 60 నివాస సముదాయాలున్న కుగ్రామం శంభువాని పాలెం గ్రామంలో ఇప్పుడు ఆర్టీసీ బస్సు శబ్దం వినిపిస్తోంది. రయ్యి రయ్యి మంటూ దూసుకువస్తున్న ప్రజారవాణా వ్యవస్థను అక్కడి మహిళలు, పిల్లలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు.

విశాఖ జిల్లాలోని జోన్ 2 పరిధి 6వ వార్డులో గల శంభువాని పాలెం గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. గత ప్రభుత్వాల హయాంలో హామీలే తప్ప ఏమీ  జరగింది లేదని అక్కడ ప్రజలు అంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు వచ్చి అక్కడి ప్రజల గోడు విని పెడ చెవిన పెట్టేసే వారు. ఎంతో మంది నాయకులను కలిసి తమ గోడు వినిపించుకునే వారు అయిన కానీ వారికి గత 70 ఏళ్ళలో ఒరిగిందేమి లేదు ఆ గ్రామస్తులకు. 

అయితే 2019లో వై.ఎస్.ఆర్.సి.పి అధికారంలోకి రావడంతో సంక్షేమం, అభివృద్ధి పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనలో చేపట్టిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం వారి పాలిట కొంగు బంగారం అయ్యింది. నేరుగా తమ సమస్యలను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వారి గడప గడపకు వెళ్లి తెలుసుకోవడం జరిగింది. మే నెల 2వ తేదీన తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించమని శంభువాని పాలెం గ్రామస్తులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు దృష్టికి తీసుకురావడం, వెంటనే ఆర్.టి.సి ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగింది. చివరికి శంభువాని పాలెం గ్రామస్తుల చిరకాల అభిలాష నెరవేరింది. మాజీ మంత్రి, భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు చొరవతో జూన్ 25 వ తేదీన లాంఛనంగా 25 పి/ఎస్ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఇన్నాళ్లు రవాణా వ్యవస్థ లేక ఇబ్బంది పడ్డ శంభువాని పాలెం గ్రామస్తులు బస్సు సౌకర్యంతో తమ కార్యకలాపాలకు గలిగిన అడ్డంకులను తొలగించుకుని ఆనందంగా జీవిస్తున్నారు.