మధురవాడ 7వవార్డ్ మొగదారమ్మ దేవాలయం రహదారిలో ప్రవహిస్తున్న మురుగునీరు
మధురవాడ: వి న్యూస్ : జూన్ 12:
మొగదారమ్మ దేవాలయం రహదారిలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ నిర్మాణాలు ఉన్న ప్రాంతం లో మరో పెద్ద నిర్మాణం చేపడుతున్నపుడు మురుగు నీరు వెళ్ళటానికి తగు చర్యలు చేపట్టవలసిన నిర్మాణాల యజమానులు నిర్లక్ష్యం వహించి నిర్మానాలు చేపట్టడం వల్ల కాలువలలో గ్రావెల్ పడి కాలువలు పొంగి రహదారులపై ప్రవహించి రాకపోకలకు తీవ్ర అంతరాయం చుట్టుపక్కల ఉన్న నివాసితులు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నవారిపై చర్యలు తీసుకుని మురుగు నీరు రోడ్ల పైకి రాకుండా ఉండేవిధంగా చూసి సామాన్యుల ఆరోగ్యం కాపాడాలని కోరుతున్నారు.