జీవో 423 ను రద్దు చేయాలి. వార్డు శానిటేషన్ సచివాలయ సెక్రెటరీలు ధర్నా
ఆంధ్రప్రదేశ్ : వి న్యూస్: జూన్ 29:
సచివాలయం వ్యవస్థ ను పూర్తిగా నిర్వీర్యం చేసేవిధంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు..
సచివాలయం ద్వారా రిక్రూట్మెంట్ చేసుకొని, మీరు మునిసిపల్ టైమింగ్స్ పాటించాలని, ఏకంగా ఏ సచివాలయం ఉద్యోగికి లేనివిధంగా 8 గంటల ఫీల్డ్ వర్క్ కేటాయించడం దారుణం
-వార్డు శానిటేషన్-ఎన్విరాన్మెంట్ కార్యదర్శుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే జి.ఓ ను వెంటనే రద్దు చేయాలి. కోరుతూ ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశానంతరం 423 జీవో కాఫీలు దగ్ధం చేశారు .
ఈ సందర్భంగా ఏ పి శానిటేషన్-ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె పీటర్ మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు 3500 మందికి పైగా వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.. రోజురోజుకీ వార్డ్ పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులపై కిందిస్థాయి అధికారులు తీవ్ర పనిభారం మోపుతు, ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా చెత్త పన్నుపై సేవా రుసుమును వసూలు చేసే బాధ్యతను కూడా ఈ కార్యదర్శులకు అప్పగించి రోజువారి టార్గెట్లు పెట్టి టార్గెట్ పూర్తి చేయని కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సస్పెండ్లు చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ??..ఏకంగా 8 గంటలు ఫీల్డ్ లో ఉండాలి అని ఉత్తర్వులు ఇవ్వడం, ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక ను నిర్వీర్యం చేసేవిధంగా ఉందని వాపోయారు.గత 45 నెలల నుంచి వార్డు శానిటేషన్ కార్యదర్శులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ప్రతిరోజు తెల్లవారుజామునే 5 గంటలకే సచివాలయ పరిధిలో విధులు నిర్వహిస్తు, తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.. జాబ్ చార్టు మేర ఇవ్వాల్సిన అధికారాలు ఇవ్వకుండా అధికారులు మానసిక క్షోభ కి గురి చేస్తున్నారు
ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యులు పడాల గోవింద్ మాట్లాడుతూ
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తుంటే, కేవలం వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు మాత్రం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విధులు నిర్వహించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం GO RT 423 ఇవ్వడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నాను..
మిగిలిన సచివాలయ ఉద్యోగుల వలె వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులకు కూడా సచివాలయ పని వేళల్లోనే విధులు నిర్వహించుకునే విధంగా CDMA అధికారులు చూడాలని, జాబ్ చార్ట్ ప్రకారం రావాల్సిన పూర్తిస్థాయి అధికారాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో శానిటేషన్-ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ నాయకులు కే రవీంద్ర. ఆడారి శివ. కె భాగ్యలక్ష్మి. మంగరాజు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు కే సత్యనారాయణ. టి.వి రావు ఎల్ వెంకటేష్. కెల్లా రమణ తదితరులు పాల్గొన్నారు.