జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో ఆషాడ మాసం రెండవ శుక్రవారం జూన్ 30వ తేదిన శాకాంబరీ దేవి ఉత్సవాలు

జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో ఆషాడ మాసం రెండవ శుక్రవారం జూన్ 30వ తేదిన శాకాంబరీ దేవి ఉత్సవాలు 

మధురవాడ:

మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు మీద కొలువైవున్న శ్రీ పంచముఖ ఆంజనేయ, శ్రీ షిర్డీ సాయినాధ సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో జూన్ 30 శుక్రవారం శాకాంబరీ దేవి ఉత్సవాలు ఘనంగా జరిపించడం జరుగుతుంది, 

శోభకృత్ నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఆషాడ మాసం  శుక్ల పక్షం ద్వాదశి శుక్రవారం ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు,

సాయంత్రం 5 00 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు శాకాంబరీ దేవిగా భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది, 

ఆ రోజు ఉదయం అమ్మవారికి నిత్యార్చనతో పూజలు ప్రారంభించి, ప్రత్యేక కుంకుమార్చన, పుష్పార్చన,  మొదలగు పూజ కార్యక్రమాలు   ఆలయ అర్చకులు ద్వారా జరిపించడం జరుగుతుంది, 

అమ్మవారికి భక్తులు ఆషాఢం సారెతో  తీసుకొని వచ్చిన వివిధ రకాల నైవేద్యాలు ఉదయం 9:30 గంటలకు ఒకే సారి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది, 

ఆషాఢం సారెతో భక్తులు తీసుకొని రావలసిన నైవేద్యాలలో కొన్ని రకాలు 

(పులిహోర, గారెలు, 

దద్దోజనం, చక్కెర పొంగలి, బూరెలు, స్వీట్ పొంగలి, కొబ్బరి అన్నం, కట్టు పొంగలి, రవ్వ కేసరి, జిలేబి,   కాజా, బాద్ షా, బొబ్బట్లు 

పరమాన్నం 1) బెల్లం, 2) పంచదార

బిస్మిల్లా బాత్, కొబ్బరి పరమాన్నం, తీపి బూంది, మైసూర్ పాక్, పెరుగు వడలు, అరెసెలు, అప్పాలు, గోధుమ నూక హల్వా, రవ్వ లడ్డు, వేరుశనగ బెల్లం ఉండలు, చలివిడి, సేమ్యా ఉప్మా, అటుకుల పులిహోర, మరియు ఇతర స్వీట్ రకాలు)

మరియు

రాత్రి 7:00 గంటలకు అమ్మవారికి పంచామృత సుగంధ జలాభిషేకం జరిపించి, ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతుంది, 

కావున భక్తులు యావన్మంది శాకాంబరీదేవి అలంకరణలో ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు,

గమనిక :- అమ్మవారిని శాకాంబరీ దేవిగా జూన్ 29 గురువారం ఉదయం 10 00 గంటల నుండి కూరగాయలతో అలంకరణ చేయడం ప్రారంబించి, సాయంత్రానికి అలంకరణ పూర్తి చేయడం జరుగుతుంది