వి టీవీ న్యూస్ వార్తకు స్పందించిన జోన్2 కమీషనర్ కే కనకమహాలక్ష్మి.
మధురవాడ: వి న్యూస్ : జూన్ 13
మధురవాడ 7వవార్డ్ మొగదారమ్మ దేవాలయం రహదారిలో ప్రవహిస్తున్న మురుగునీరు అని మంగళవారం వి టీవీ న్యూస్ వచ్చిన వార్తకు స్పందించిన జోన్2 కమీషనర్ కే కనకమహాలక్ష్మి మంగళవారం జీవీఎంసీ సిబ్బంది తో మొగదారమ్మ దేవాలయం పరిసర ప్రాంతంలో పర్యటించి కాలువలు జాము అయ్యి మురుగు నీరు రోడ్ల పై ప్రవహిస్తున్న ప్రాంతంలో జేసీబీ సహాయంతో కాలువలలో పేరుకుపోయిన చెత్తను తొలగించి మురుగునీరు కాలువలనుండి మురుగు నీరు బయటకు రాకుండా ఆమె దగ్గర ఉండి జీవీఎంసీ సిబ్బందితో సమస్యను పరిష్కరించారు. స్థానిక మొగదారమ్మ కాలనీ ప్రజలు జోన్2 కమీషనర్ దగ్గర ఉండి మురుగు నీటి సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా పెన్వి టీవీ న్యూస్ ప్రచురించిన వార్త వల్ల సమస్య మా దృష్టికి వచ్చిందని వెంటనే సిబ్బందితో నేరుగా నేను సమస్య ప్రదేశానికి వచ్చి శుభ్రం చేయించానని తెలిపారు. మన భారత దేశంలో నాల్గవ స్తంభం గా పిలవబడుతున్న విలేకరులు అధికారులు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా ప్రజల సమస్యలను తెలిపే వార్తలు ప్రచురించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వి టీవీ న్యూస్ వార్తలు ప్రచురిస్తుందని యాజమాన్యాన్ని కొనియాడారు.